ఆగస్ట్‌ 15కు కరోనా వ్యాక్సిన్ " ఐసీఎంఆర్‌ ప్రకటన

ప్రపంచ మానవాళిని కరోనా వణికిస్తున్న వేళ వ్యాక్సిన్‌పై వెలువడుతున్న వార్తలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్‌పై ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్)‌ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది ఆగస్ట్‌ 15 కల్లా కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడించింది. వ్యాక్సిన్ ప్రస్తుతం మానవ ప్రయోగ దశలో ఉందని వివరించింది. ఇప్పటికే జంతువులపై నిర్వహించిన పరీక్షలు మెరుగైన ఫలితాలను ఇచ్చినట్టు వెల్లడించింది. ఈమేరకు ఐసీఎంఆర్‌ స్వయంగా ఒక ప్రకటన విడుదల చేసింది. పూణేలోని […]

Advertisement
Update:2020-07-03 06:13 IST

ప్రపంచ మానవాళిని కరోనా వణికిస్తున్న వేళ వ్యాక్సిన్‌పై వెలువడుతున్న వార్తలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి.

కరోనా వ్యాక్సిన్‌పై ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్)‌ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది ఆగస్ట్‌ 15 కల్లా కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడించింది. వ్యాక్సిన్ ప్రస్తుతం మానవ ప్రయోగ దశలో ఉందని వివరించింది.

ఇప్పటికే జంతువులపై నిర్వహించిన పరీక్షలు మెరుగైన ఫలితాలను ఇచ్చినట్టు వెల్లడించింది. ఈమేరకు ఐసీఎంఆర్‌ స్వయంగా ఒక ప్రకటన విడుదల చేసింది. పూణేలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సహకారంతో కరోనా నివారణ కోవాక్సిన్‌ను భారత్‌ బయోటిక్‌తో కలిసి ఐసీఎంఆర్‌ రూపొందిస్తోంది.

కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, అనేక సంస్థలు కరోనా వ్యాక్సిన్‌పై ప్రయోగాలు వేగవంతంగా చేస్తున్నాయి. ఇప్పటికే పలు వ్యాక్సిన్‌లు కొన్ని దశలను విజయవంతంగా దాటాయి. ఇప్పటి వరకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ వ్యాక్సిన్ ప్రయోగం విషయంలో ముందుంది. ఆక్స్‌ఫర్డ్ వర్శిటీ చేస్తున్న ప్రయోగం మూడో దశకు చేరింది.

Tags:    
Advertisement

Similar News