రామోజీ ఫిల్మ్ సిటీని మూడేళ్ల పాటు అద్దెకు ఇచ్చేశారు...
ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీగా పేరొందిన రామోజీ ఫిల్మ్ సిటీని మూడేళ్ల పాటు అద్దెకు ఇచ్చేశారు. అదేంటి.. రామోజీ ఫిల్మ్ సిటీని సినిమా షూటింగ్స్‌కు అద్దెకు ఇవ్వడం సాధారణమేగా అని మీరు అనుకుంటుండొచ్చు. అయితే, ఈ సారి విడివిడిగా కాకుండా.. ఫిల్మ్ సిటీ మొత్తాన్ని ఒక్కరికే మూడేళ్ల ఒప్పందంతో అద్దెకు ఇచ్చారు. ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్‌స్టార్ ఈ మేరకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని, అయితే ఎంత మొత్తానికి ఈ ఒప్పందం జరిగిందనే విషయం తెలియదని ‘రిపబ్లిక్ వరల్డ్’ రిపోర్టు […]
ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీగా పేరొందిన రామోజీ ఫిల్మ్ సిటీని మూడేళ్ల పాటు అద్దెకు ఇచ్చేశారు. అదేంటి.. రామోజీ ఫిల్మ్ సిటీని సినిమా షూటింగ్స్‌కు అద్దెకు ఇవ్వడం సాధారణమేగా అని మీరు అనుకుంటుండొచ్చు. అయితే, ఈ సారి విడివిడిగా కాకుండా.. ఫిల్మ్ సిటీ మొత్తాన్ని ఒక్కరికే మూడేళ్ల ఒప్పందంతో అద్దెకు ఇచ్చారు.
ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్‌స్టార్ ఈ మేరకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని, అయితే ఎంత మొత్తానికి ఈ ఒప్పందం జరిగిందనే విషయం తెలియదని ‘రిపబ్లిక్ వరల్డ్’ రిపోర్టు చేసింది. ఈ ఒప్పందం వెంటనే అమలులోనికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపై ఇతర సినిమా షూటింగ్స్‌కు అనుమతులు ఇవ్వకూడదని అద్దెదారుడు డిస్నీ సంస్థ తెలిపింది.
కరోనా లాక్‌డౌన్ కారణంగా ప్రేక్షకులు వినోదం కోసం ఓటీటీలను ఆశ్రయించారు. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5 వంటి ఓటీటీల్లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు విడుదల చేయడంతో ప్రజలు విపరీతంగా ఆదరించారు. అదే సమయంలో హాట్‌స్టార్ ఈ రేసులో వెనుకబడింది. దీంతో తాము సొంతగా వెబ్ సిరీస్‌లు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మధ్యే హాట్‌స్టార్‌ను డిస్నీ సంస్థ కొనుగోలు చేసింది. ఓటీటీపై భారీ పెట్టుబడులు పెట్టనుంది.
ఈ నేపథ్యంలోనే రామోజీ ఫిల్మ్ సిటీని పూర్తిగా అద్దెకు తీసుకొని వెబ్‌సిరీస్‌లు నిర్మించనుంది. రాబోయే రోజుల్లో ఇతర ఓటీటీలకు గట్టి పోటీనివ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా రామోజీ ఫిల్మ్ సిటీని డిస్నీ పార్క్ లాగా తీర్చి దిద్దాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది.