కీర్తిసురేష్ కు ఓటీటీ ఎదురుదెబ్బ
ఓటీటీకి ఆదరణ పెరిగిన తర్వాత బహుశా ఓ సినిమాకు ఇంత హైప్ ఎప్పుడూ వచ్చి ఉండదు. సినిమా రిలీజ్ తో సమానంగా ఓటీటీ రిలీజ్ పై ఇంత హైప్ ఎప్పుడూ రాలేదు. లాక్ డౌన్ టైమ్ లో అంతా ఓటీటీకి పరిమితమైన వేళ.. కీర్తిసురేష్ నటించిన పెంగ్విన్ సినిమా సూపర్ హిట్టయిపోతుందని అమెజాన్ భావించి ఉండొచ్చు. నేరుగా డబ్బులు పెట్టాల్సిన అవసరం వినియోగదారుడికి లేదు కాబట్టి.. అంతా ఎగబడి పెంగ్విన్ సినిమాను చూసేస్తారని మేకర్స్ కూడా అనుకొని […]
ఓటీటీకి ఆదరణ పెరిగిన తర్వాత బహుశా ఓ సినిమాకు ఇంత హైప్ ఎప్పుడూ వచ్చి ఉండదు. సినిమా రిలీజ్ తో సమానంగా ఓటీటీ రిలీజ్ పై ఇంత హైప్ ఎప్పుడూ రాలేదు. లాక్ డౌన్ టైమ్ లో అంతా ఓటీటీకి పరిమితమైన వేళ.. కీర్తిసురేష్ నటించిన పెంగ్విన్ సినిమా సూపర్ హిట్టయిపోతుందని అమెజాన్ భావించి ఉండొచ్చు. నేరుగా డబ్బులు పెట్టాల్సిన అవసరం వినియోగదారుడికి లేదు కాబట్టి.. అంతా ఎగబడి పెంగ్విన్ సినిమాను చూసేస్తారని మేకర్స్ కూడా అనుకొని ఉండొచ్చు.
కానీ వీళ్లందరికీ గంపగుత్తగా షాకిచ్చింది పెంగ్విన్ సినిమా. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ మూవీ ఏ ఒక్క లాంగ్వేజ్ లో ఆకట్టుకోకపోవడం బాధాకరం. ఒక్కొక్క లాంగ్వేజ్ గురించి విడివిడిగా మాట్లాడుకుందాం.
ముందుగా తమిళ్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఈ సినిమాను తమిళ్ లోనే తీశారు. తెలుగులో కూడా షూట్ చేశామని మేకర్స్ చెబుతున్నప్పటికీ సినిమా చూస్తే అది నమ్మశక్యం అనిపించదు. కాబట్టి ముందుగా తమిళ వెర్షన్ గురించి మాట్లాడుకుంటే… ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ కీర్తిసురేష్ అయితే, రెండో ప్లస్ పాయింట్ తమిళజనాలకు తెలిసిన ఇతర నటీనటులు, టెక్నీషియన్లు. అంతా కోలీవుడ్ కనెక్షన్ ఉన్నవాళ్లే. కానీ సినిమాను మాత్రం తమిళ తంబీలు ఆదరించలేదు. ఫస్టాఫ్ లో ఉన్నంత బిగి సెకెండాఫ్ లో లేకపోవడం.. ఆల్రెడీ ఈ తరహా సినిమాల్ని తమిళ్ లో చాలా చూసి ఉండడంతో పొరుగు రాష్ట్ర ప్రేక్షకులకు పెంగ్విన్ పెద్దగా ఎక్కలేదు.
తమిళ్ లో ఏవైతే ప్లస్ పాయింట్స్ అనుకున్నామో తెలుగులో అవే మైనస్ పాయింట్స్ గా మారాయి. కీర్తిసురేష్ తప్ప మరో నటుడు ఎవ్వరూ తెలుగు ఆడియన్స్ కు తెలీదు. నటీనటులు తెలియకపోయినా.. కథ-స్క్రీన్ ప్లే బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఇవేం పట్టించుకోరు. కానీ స్క్రీన్ ప్లే మరీ చప్పగా, డల్ గా ఉండడంతో పెంగ్విన్ మెరవలేకపోయింది. దీనికితోడు చేతిలోనే రిమోట్ ఉండడంతో.. సగం చూసి సినిమాను పక్కనపెట్టామంటూ చాలామంది సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు.
ఇక మలయాళం వెర్షన్ కు వస్తే మరీ ఘోరం. మల్లూవుడ్ జనాలకు ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ లు అస్సలు కొత్త కాదు. ఇంకా చెప్పాలంటే ఇంతకంటే అమోఘమైన సినిమాలు చూసిన ట్రాక్ రికార్డ్ ఆ ప్రేక్షకులది. దీంతో పెంగ్విన్ ను వాళ్లు చాలా లైట్ తీసుకున్నారు. ఇంకా సూటిగా చెప్పాలంటే మలయాళం వెర్షన్ అట్టర్ ఫ్లాప్ అయిందని అనుకోవచ్చు.
ఇలా భారీ అంచనాలతో వచ్చిన పెంగ్విల్ సినిమాకు సంబంధించి.. కీర్తిసురేష్ నటన బాగుందనే కాంప్లిమెంట్ తప్ప మిగతావన్నీ నెగెటివ్ కామెంట్లే.