తెలంగాణలో పెరుగుతున్న కరోనా... ఒకే రోజు 253 కేసులు
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో శనివారం ఒక్కరోజే కొత్తగా 253 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒకే రోజు ఈ స్థాయిలో కేసులు బయటపడడం ఇదే తొలిసారి. తెలంగాణలో మొత్తం కరోనా కేసులు నాలుగు వేల 737కు చేరాయి. కరోనాతో తెలంగాణలో శనివారం ఒక్కరోజే 8 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 182కు చేరింది. శనివారం నమోదైన 253 కేసుల్లో 179 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదు అయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో […]
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో శనివారం ఒక్కరోజే కొత్తగా 253 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒకే రోజు ఈ స్థాయిలో కేసులు బయటపడడం ఇదే తొలిసారి.
తెలంగాణలో మొత్తం కరోనా కేసులు నాలుగు వేల 737కు చేరాయి. కరోనాతో తెలంగాణలో శనివారం ఒక్కరోజే 8 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 182కు చేరింది. శనివారం నమోదైన 253 కేసుల్లో 179 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదు అయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 24, మేడ్చల్ జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 11, మహబూబ్‌నగర్ జిల్లాలో 4 కేసులు నమోదు అయ్యాయి.
జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కరోనా బారినపడ్డారు. ఎమ్మెల్యే సతీమణి, డ్రైవర్, గన్‌మెన్, వంట మనిషికి కూడా కరోనా పాటిజివ్‌గా తేలింది. వీరికి హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
అటు ఆంధ్రప్రదేశ్‌లో శనివారం 222 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 94 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో భారీగా కరోనా పరీక్షలు నిర్వహిస్తుండడం, వైరస్ బారిన పడిన వారిని తక్షణం గుర్తిస్తుండడంతో రికవరీ రేటు కూడా చాలా మెరుగ్గా ఉంది. శనివారం ఒక్కరోజే ఏపీలో 14వేల 477 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఏపీలో ఇప్పటి వరకు మూడు వేల 185 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 182 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు కరోనా వల్ల 82 మంది చనిపోయారు. ఏపీలో ప్రస్తుతం 2వేల 591 యాక్టివ్ కేసులున్నాయి. ఎక్కువ పరీక్షలు చేయడం, వైరస్ బారిన పడిన వారిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తుండడంతో ఏపీలో రికవరీ రేటు చాలా మెరుగ్గా ఉన్నట్టు భావిస్తున్నారు.