విశాఖలో గోప్యంగా ప్రవీణ్‌ ప్రకాశ్ పర్యటన

విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాట్లుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. పరిపాలన రాజధానికి అవసరమైన భవనాలు, ఏర్పాట్లను ప్రభుత్వ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్ మరోసారి విశాఖలో పర్యటించారు. గోప్యంగా పలు ప్రాంతాల్లో పర్యటించారు. భీమిలి బీచ్‌ రోడ్డులోని పలు స్థలాలను ఆయన పరిశీలించారు. ఒక కారులో ప్రవీణ్‌ ప్రకాశ్… మరో కారులో ప్రముఖ ఆర్కిటెక్ట్ ఒకరు పర్యటించారు. కాపులుప్పాడలో గ్రేహౌండ్స్‌కు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. తొట్లకొండ, రామానాయుడు స్టూడియో పరిసర ప్రాంతాల్లోనూ […]

Advertisement
Update:2020-06-10 02:50 IST

విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాట్లుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. పరిపాలన రాజధానికి అవసరమైన భవనాలు, ఏర్పాట్లను ప్రభుత్వ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.

ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్ మరోసారి విశాఖలో పర్యటించారు. గోప్యంగా పలు ప్రాంతాల్లో పర్యటించారు. భీమిలి బీచ్‌ రోడ్డులోని పలు స్థలాలను ఆయన పరిశీలించారు.

ఒక కారులో ప్రవీణ్‌ ప్రకాశ్… మరో కారులో ప్రముఖ ఆర్కిటెక్ట్ ఒకరు పర్యటించారు. కాపులుప్పాడలో గ్రేహౌండ్స్‌కు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. తొట్లకొండ, రామానాయుడు స్టూడియో పరిసర ప్రాంతాల్లోనూ ఈ బృందం పర్యటించింది.

ప్రవీణ్ ప్రకాశ్‌తో పాటు పర్యటించిన ప్రముఖ ఆర్కిటెక్ట్ బీమల్ పటేల్‌గా చెబుతున్నారు. ఆయన నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం విశాఖకు వచ్చింది. పరిపాలన రాజధానికి అవసరమైన ప్రదేశాలను గుర్తించేందుకు వీరు పర్యటించినట్టు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News