సెప్టెంబర్‌లోనే కరోనా కంట్రోల్... కొత్త రిపోర్టు !
ఒక్క రోజే తొమ్మిదివేల కేసులు. దీంతో దేశంలో కరోనా కేసులు రెండున్నర లక్షలు దాటాయి. మహారాష్ట్రలో 24 గంటల్లోనే 3,007 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం అక్కడ 85,975 కేసులు ఇప్పటివరకూ నమోదు అయ్యాయి. ఇప్పటికే 3 వేల మందికి పైగా ఆ రాష్ట్రంలో చనిపోయారు. రెండు నెలల లాక్‌డౌన్ తర్వాత కూడా దేశంలో పరిస్థితిలో మార్పు రావడం లేదు. కరోనా కేసుల గ్రాఫ్ తగ్గడం లేదు. దేశంలో కరోనా కేసులు తగ్గేదేలా? ఎప్పుడూ తగ్గుతుందనే దానిపై కేంద్ర […]
ఒక్క రోజే తొమ్మిదివేల కేసులు. దీంతో దేశంలో కరోనా కేసులు రెండున్నర లక్షలు దాటాయి. మహారాష్ట్రలో 24 గంటల్లోనే 3,007 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం అక్కడ 85,975 కేసులు ఇప్పటివరకూ నమోదు అయ్యాయి. ఇప్పటికే 3 వేల మందికి పైగా ఆ రాష్ట్రంలో చనిపోయారు. రెండు నెలల లాక్‌డౌన్ తర్వాత కూడా దేశంలో పరిస్థితిలో మార్పు రావడం లేదు. కరోనా కేసుల గ్రాఫ్ తగ్గడం లేదు.
దేశంలో కరోనా కేసులు తగ్గేదేలా? ఎప్పుడూ తగ్గుతుందనే దానిపై కేంద్ర ఆరోగ్య శాఖ కొంత అధ్యయనం చేస్తోంది. సెప్టెంబర్ రెండో వారం తర్వాతే దేశంలో కరోనా కంట్రోల్‌లోకి వస్తుందని ఆరోగ్య శాఖ చేసిన ఓ అధ్యయనంలో తేలింది. కరోనా వైరస్ బారిన పడినవారు…. వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య సమానమైనప్పుడే వైరస్ నుంచి పూర్తిగా విముక్తి అయినట్లు అవుతుందని అంటున్నారు.
బెయిలీ రిలేటివ్ రిమూవల్ రేట్ మెథడాలజీ ప్రకారం మార్చి 1 నుంచి మే 19 వరకు కరోనా కేసుల డేటాను పరిశీలించారు. పబ్లిక్ హెల్త్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అనిల్ కుమార్, రూపాలీ రాయ్ ఇద్దరూ కలిసి దీనిపై రిసెర్చ్ చేశారు. ఈ అధ్యయనం ఎపిడెమియాలజీ ఇంటర్నేషన్ జనరల్‌లో పబ్లిష్ అయింది.
బెయిలీ థియరీ ప్రకారం సెప్టెంబర్ మధ్య కాలం నాటికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందంటున్నారు. కరోనా సోకిన వారు, వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య అప్పటికే సమానమవుతుందని…. దీంతో కరోనా ఇక్కడి నుంచి తగ్గుముఖం పడుతుంది అనేది వీరి అధ్యయనం.