విజయసాయిరెడ్డితో ఆదిశేషగిరిరావు భేటీ
మొన్నటి ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి బయటకు జంపింగ్‌లు జరిగాయి… కొందరు వైసీపీలోకి వచ్చి చేరారు. అప్పటి వరకు వైసీపీని తిట్టి కూడా తీరా ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి కొందరు ప్రజాప్రతినిధులైపోయారు. వారు అదృష్టవంతులు. మరికొందరిని మాత్రం దురదృష్టం వెంటాడింది. జగన్‌మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో పోరాటం చేసిన పదేళ్లు ఆయన వెంట ఉన్న కొందరు నాయకులు… తీరా ఎన్నికల సమయంలో ఆవేశంతో వైసీపీ నుంచి వెళ్లిపోయారు. అలా వెళ్లిపోయిన వారిలో సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు […]
మొన్నటి ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి బయటకు జంపింగ్‌లు జరిగాయి… కొందరు వైసీపీలోకి వచ్చి చేరారు. అప్పటి వరకు వైసీపీని తిట్టి కూడా తీరా ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి కొందరు ప్రజాప్రతినిధులైపోయారు. వారు అదృష్టవంతులు.
మరికొందరిని మాత్రం దురదృష్టం వెంటాడింది. జగన్‌మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో పోరాటం చేసిన పదేళ్లు ఆయన వెంట ఉన్న కొందరు నాయకులు… తీరా ఎన్నికల సమయంలో ఆవేశంతో వైసీపీ నుంచి వెళ్లిపోయారు. అలా వెళ్లిపోయిన వారిలో సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఒకరు.
జగన్ పార్టీ పెట్టిన తర్వాత సుధీర్ఘకాలం ఆయనతోనే ప్రయాణం సాగించారు. కానీ ఎన్నికల వేళ టికెట్ల విషయంలో విబేధాలు రావడంతో ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయారని చెబుతుంటారు. గుంటూరు ఎంపీ టికెట్ ఆశించగా… జగన్‌మోహన్ రెడ్డి విజయవాడ టికెట్ ఆఫర్ చేసినట్టు చెబుతుంటారు. దాంతో ఆయన నొచ్చుకుని వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు.
ఇప్పుడు తాజాగా ఆదిశేషగిరిరావు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కలవడం చర్చనీయాంశమైంది. ఆ ఫొటో బయటకు రావడంతో ఆదిశేషగిరిరావు తిరిగి వైసీపీలోకి వస్తున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ భేటీ చిత్ర పరిశ్రమకు సంబంధించినది అని చెబుతున్నా…. విజయసాయిరెడ్డిని కలవడం బట్టి రాజకీయ కారణాలు కూడా ఉంటాయని భావిస్తున్నారు.
ఆదిశేషగిరిరావును వైసీపీలోకి ఆహ్వానించడం సరైనదా కాదా అన్న చర్చ కూడా నడుస్తోంది. కాకపోతే ఆదిశేషగిరిరావు… జగన్‌మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు వెంటే ఉన్నారు. దురదృష్టం కొద్ది ఎన్నికల వేళ ఆయన బయటకు వెళ్లిపోయారు.
2014లో జగన్‌మోహన్ రెడ్డి ఓడిపోగానే టీడీపీలో చేరి ఐదేళ్లు జగన్‌ను బాగా తిట్టిన వారు కూడా జగన్ సీఎం అవగానే వైసీపీలో చేరారు. కాని ఆదిశేషగిరిరావు కష్టాల్లో జగన్‌తోనే ఉన్నారు. కాబట్టి ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే… ఆదిశేషగిరి రావును వైసీపీలోకి ఆహ్వానించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.