ఆ ఒక్కటి అడగొద్దు...

ప్రస్తుతం దేశవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్, ఓటీటీ రిలీజ్ మధ్య భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. లాక్ డౌన్ తో థియేటర్లన్నీ మూతపడిన వేళ.. తమ సినిమాల్ని ఓటీటీకి ఇస్తే తప్పేంటని ఓ వర్గం వాదిస్తోంది. మరో వర్గం మాత్రం సిల్వర్ స్క్రీన్ కోసం తీసిన సినిమాల్ని రిలీజ్ కు ముందే ఓటీటీకి ఇవ్వడం అన్యాయం అని వాదిస్తోంది. ఓవైపు ఇలా వాదనలు నడుస్తుండగానే మరోవైపు కొన్ని సినిమాలు ఓటీటీకి అమ్ముడుపోతున్నాయి. ఆర్థిక కష్టాల నుంచి కాస్తయినా గట్టెక్కేందుకు […]

Advertisement
Update:2020-05-28 14:08 IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్, ఓటీటీ రిలీజ్ మధ్య భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. లాక్ డౌన్ తో థియేటర్లన్నీ మూతపడిన వేళ.. తమ సినిమాల్ని ఓటీటీకి ఇస్తే తప్పేంటని ఓ వర్గం వాదిస్తోంది. మరో వర్గం మాత్రం సిల్వర్ స్క్రీన్ కోసం తీసిన సినిమాల్ని రిలీజ్ కు ముందే ఓటీటీకి ఇవ్వడం అన్యాయం అని వాదిస్తోంది. ఓవైపు ఇలా వాదనలు నడుస్తుండగానే మరోవైపు కొన్ని సినిమాలు ఓటీటీకి అమ్ముడుపోతున్నాయి.

ఆర్థిక కష్టాల నుంచి కాస్తయినా గట్టెక్కేందుకు కొంతమంది నిర్మాతలు ఇలా తమ సినిమాల్ని గంపగుత్తగా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లాంటి సంస్థలకు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడీ వ్యవహారంపై రకుల్ ప్రీత్ సింగ్ ను కూడా ప్రశ్నించింది మీడియా. అయితే రకుల్ చాలా తెలివైందనే విషయం మనందరికీ తెలిసిందే కదా. ఈ వివాదం నుంచి చాలా తెలివిగా తప్పించుకుంది.

ఓ సినిమాను థియేట్రికల్ రిలీజ్ వరకు ఉంచాలా.. లేక అంతకంటే ముందు ఓటీటీకి ఇచ్చేయాలా అనే నిర్ణయం పూర్తిగా నిర్మాత చేతుల్లో ఉంటుందని అంటోంది నిర్మాత. సినిమాపై సర్వహక్కులు ప్రొడ్యూసర్ వే కాబట్టి అతడి నిర్ణయమే ఫైనల్ అంటోంది.

ఒకవేళ తను నటించిన ఏదైనా సినిమాను ముందుగానే ఓటీటీకి ఇచ్చేయాలని నిర్మాత నిర్ణయిస్తే, దానిపై తనతో చర్చించాల్సిన అవసరం లేదంటోంది. కేవలం తనను మాత్రమే కాకుండా.. ఈ విషయంలో ఏ హీరోయిన్ ను నిర్మాత సంప్రదించాల్సిన అవసరం లేదంటోంది. సినిమా అనేది పూర్తిగా ప్రొడ్యూసర్ ప్రాపర్టీ కాబట్టి అది తన ఇష్టమని, ఈ విషయంలో ఇంతకంటే ఎక్కువగా తనను ఇన్ వాల్వ్ చేయొద్దని రిక్వెస్ట్ చేసింది రకుల్.

Tags:    
Advertisement

Similar News