రాయలసీమ ఎత్తిపోతలపై స్టే విధింపు

రాయలసీమను కరువు నుంచి కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై జోనల్ బెంచ్ స్టే విధించింది. పర్యావరణ శాఖ అనుమతులు లేకుండానే ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన చెన్నై ఎన్‌జీటీ బెంచ్… తదుపరి చర్యలపై స్టే ఇచ్చింది. ఈ అంశం పరిశీలనకు ఒక కమిటీని వేసింది. కమిటీ నివేదిక వచ్చే వరకు ఎత్తిపోతల పథకంపై […]

Advertisement
Update:2020-05-21 01:39 IST

రాయలసీమను కరువు నుంచి కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై జోనల్ బెంచ్ స్టే విధించింది. పర్యావరణ శాఖ అనుమతులు లేకుండానే ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన చెన్నై ఎన్‌జీటీ బెంచ్… తదుపరి చర్యలపై స్టే ఇచ్చింది.

ఈ అంశం పరిశీలనకు ఒక కమిటీని వేసింది. కమిటీ నివేదిక వచ్చే వరకు ఎత్తిపోతల పథకంపై తదుపరి చర్యలు వద్దని ఆదేశించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పిటిషన్‌ను ఎన్‌జీటీ బెంచ్‌ జస్టిస్ రామకృష్ణ న్ విచారించారు. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇవ్వకుండానే, ఏపీ ప్రభుత్వ వాదన కూడా వినకుండానే స్టే ఇచ్చేశారు.

ఈ పథకం నిర్మాణంకోసం పర్యావరణ అనుమతులు అవసరమా?… నీటి పంపకాలకు సంబంధించిన అంశం అయితే అందుకు అనుమతులు ఉన్నాయా?… పర్యావరణానికి విఘాతం కలగకుండా ఏపీ ప్రభుత్వం తీసుకునే చర్యలు సరిపోతాయా? వంటి అంశాలను పరిశీలించి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఎన్‌జీటీ చెన్నై బెంచ్ ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్ట్ 11కు వాయిదా వేసింది.

అయితే ఏపీ ప్రభుత్వానికి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండానే స్టే ఇవ్వడంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. చెన్నై బెంచ్‌ ఆదేశాలను ఎన్‌జీటీ ముందు మరోసారి సవాల్ చేయాలని నిర్ణయించింది.

Tags:    
Advertisement

Similar News