ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ?
రియల్ లైఫ్ లో ముఖ్యమంత్రి సీటు కోసం ఆశపడి భంగపడిన పవన్ కల్యాణ్, రీల్ లైఫ్ లో మాత్రం సీఎం అవ్వబోతున్నారు. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఓ సినిమాలో పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిగా కనిపించే అవకాశం ఉంది. పవన్ కు ఈ అవకాశాన్ని మెగాస్టార్ చిరంజీవి ఇవ్వబోతున్నారు. త్వరలోనే లూసిఫర్ రీమేక్ లో నటించబోతున్నాడు చిరంజీవి. ఆచార్య సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే లూసిఫర్ స్టార్ట్ అవుతుంది. ఇందులో ఓ కీలకమైన పాత్ర కోసం పవన్ […]
రియల్ లైఫ్ లో ముఖ్యమంత్రి సీటు కోసం ఆశపడి భంగపడిన పవన్ కల్యాణ్, రీల్ లైఫ్ లో మాత్రం సీఎం అవ్వబోతున్నారు. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఓ సినిమాలో పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిగా కనిపించే అవకాశం ఉంది. పవన్ కు ఈ అవకాశాన్ని మెగాస్టార్ చిరంజీవి ఇవ్వబోతున్నారు.
త్వరలోనే లూసిఫర్ రీమేక్ లో నటించబోతున్నాడు చిరంజీవి. ఆచార్య సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే లూసిఫర్ స్టార్ట్ అవుతుంది. ఇందులో ఓ కీలకమైన పాత్ర కోసం పవన్ పేరును పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సినిమాలో ముఖ్యమంత్రి పాత్రధారి చనిపోతాడు. అతడికి ప్రధాన అనుచరుడిగా ఉన్న మోహన్ లాల్.. సదరు ముఖ్యమంత్రి కొడుకును తీసుకొచ్చి సీఎంను చేస్తాడు.
నిజానికి ముఖ్యమంత్రి కొడుక్కి ఎలాంటి రాజకీయ అనుభవం ఉండదు, రాజకీయాలంటే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కానీ బాగా ట్రైనింగ్ ఇచ్చి అతడ్ని ముఖ్యమంత్రిగా నిలబెడతాడు మోహన్ లాల్. ఇందులో మోహన్ లాల్ పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నాడు. ఆ యంగ్ ముఖ్యమంత్రి పాత్రలో పవన్ కల్యాణ్ ను అనుకుంటున్నారట.
ప్రస్తుతానికి ఇది గాసిప్ లెవెల్లోనే ఉంది. కానీ నిజమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. ఎందుకంటే రీసెంట్ గా సైరా సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు పవన్ కల్యాణ్. ఇప్పుడు అన్నయ్య కోరితే లూసిఫర్ రీమేక్ లో 15 నిమిషాల నిడివి ఉన్న ఈ పాత్రను చేయడానికి ఎలాంటి అభ్యంతరం వ్యక్తంచేయకపోవచ్చు.