కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలి....
కరోనా వైరస్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా ఉంటుందని… దానితో కలిసి జీవించడం నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. వైరస్‌కు వ్యాక్సిన్ లేదా మందుల ఉత్పత్తికి ప్రాధాన్యతను గుర్తించి హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఫార్మా సిటీకి కేంద్రం నాలుగు వేల కోట్లను సమకూర్చాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి రేటు కంటే కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని వివరించారు. కరోనాకు వ్యాక్సిన్ లేదు అన్నది […]
కరోనా వైరస్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా ఉంటుందని… దానితో కలిసి జీవించడం నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు.
వైరస్‌కు వ్యాక్సిన్ లేదా మందుల ఉత్పత్తికి ప్రాధాన్యతను గుర్తించి హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఫార్మా సిటీకి కేంద్రం నాలుగు వేల కోట్లను సమకూర్చాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో కరోనా వ్యాప్తి రేటు కంటే కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని వివరించారు. కరోనాకు వ్యాక్సిన్ లేదు అన్నది వాస్తవం కాబట్టి… ప్రస్తుత పరిణామాలు ప్రజల జీవితాలకు, జీవనోపాధికి మధ్య బొమ్మా బొరుసులా మారకూడదన్నారు. వైరస్‌తో కలిసి జీవించడం నేర్చుకుంటూ ముందుకెళ్లాలన్నారు. సమాజంలో సాధారణ పరిస్థితులను పెద్దెత్తున పునరుద్దరించే దిశగా ప్రణాళికలు ఉండాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
కరోనా కారణంగా చైనా నుంచి తయారీ రంగాన్ని భారత్‌వైపు మళ్లించుకునేందుకు గొప్ప అవకాశం ఏర్పడిందన్నారు. ఆ దిశగా అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రైవేట్ సంస్థలు వారివారి ఉద్యోగులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. యాజమాన్యాలు ఉద్యోగుల్లో విశ్వాసం నింపాలని కోరారు. కరోనా పేరుతో మానవ వనరులను తగ్గించుకునే ఆలోచన సరైనది కాదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.