ప్రజల ముందుకు కిమ్... అనుమానిస్తున్న అంతర్జాతీయ మీడియా!

ఉత్తర కొరియా అధ్యక్షుడు, సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ సమాజంలో అనుమానాలు నెలకొన్నాయి. కిమ్ మరణించాడని అమెరికా మీడియాతో పాటు పలు న్యూస్ ఏజెన్సీలు వార్తలు వెలువరించాయి. ఏప్రిల్ 11 నుంచి అతను అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటు ఏప్రిల్ 15న తన తాతయ్య జయంతి ఉత్సవాలకు కూడా కిమ్ రాకపోవడంతో అతని మరణవార్తలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఊహాగానాలన్నింటికీ తెరదించుతూ కిమ్ ప్రజల ముందుకు వచ్చినట్లు […]

Advertisement
Update:2020-05-02 05:32 IST

ఉత్తర కొరియా అధ్యక్షుడు, సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ సమాజంలో అనుమానాలు నెలకొన్నాయి. కిమ్ మరణించాడని అమెరికా మీడియాతో పాటు పలు న్యూస్ ఏజెన్సీలు వార్తలు వెలువరించాయి. ఏప్రిల్ 11 నుంచి అతను అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటు ఏప్రిల్ 15న తన తాతయ్య జయంతి ఉత్సవాలకు కూడా కిమ్ రాకపోవడంతో అతని మరణవార్తలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

ఈ ఊహాగానాలన్నింటికీ తెరదించుతూ కిమ్ ప్రజల ముందుకు వచ్చినట్లు ఉత్తరకొరియా అధికారిక మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది. దేశ రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపంలోని సన్‌చాన్ ప్రాంతంలో శుక్రవారం కొత్త ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి కిమ్ వచ్చినట్లు సదరు మీడియా తెలిపింది. కిమ్‌తో పాటు అతని సోదరి కిమ్ యో జంగ్ కూడా హాజరైనట్లు పేర్కొంది. కిమ్ చాలా ఉత్సాహంగా ఉన్నారని.. ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని పేర్కొంది.

కాగా, ఈ కార్యక్రమానికి అధికారిక మీడియా తప్ప ఇతర జర్నలిస్టులు, మీడియా సంస్థలను అనుమతించలేదు. కేవలం కేసీఎన్ఏ విడుదల చేసిన ఫొటోల ఆధారంగానే వార్తలు బయటకు వచ్చాయి.

కాగా, ఈ ఫొటోలను అంతర్జాతీయ మీడియా ధృవీకరించడం లేదు. ఇవి శుక్రవారం తీసిన ఫొటోలని మేం నమ్మలేం. నిజంగా కిమ్ ప్రజల ముందుకు వస్తే ఇతర మీడియాను ఎందుకు ఆహ్వానించలేదు. కేవలం సొంత మీడియాలోనే ఫొటోలు ఎందుకు వస్తున్నాయి అని ప్రశ్నిస్తున్నాయి. దీంతో కిమ్ బయటకు వచ్చినా చాలా ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి.

మరోవైపు కిమ్ ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలను చైనా, అమెరికాలు ఖండించాయి. అతను క్షేమంగానే ఉన్నట్లు తాము నమ్ముతున్నాయని చెప్పాయి. కానీ, ఉత్తర కొరియాకు ఒక బృందాన్ని పంపిస్తామని చైనా చెబుతుండగా.. అమెరికా కిమ్ బయటకు వచ్చిన విషయంపై పెద్దగా స్పందించట్లేదు.

Tags:    
Advertisement

Similar News