హాంకాంగ్ యూనివర్సిటీ పరిశోధన... చైనాలో 2,32,000 కరోనా కేసులు..!
హాంకాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంతో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. చైనాలో మొదటి దశలో కరోనా బారిన 2,32,000 మంది పడి ఉంటారని అంచనా వేస్తున్నారు. హాంకాంగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫెంగ్‌వూ నేతృత్వంలో చేసిన అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడవుతున్నాయి. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం… ఇప్పటి వరకు ఆ దేశంలో 82,789 మందికి కరోనా పాజిటీవ్‌గా నమోదవగా.. 4,632 మంది కరోనాతో మరణించారు. కాగా, విస్తృత ప్రమాణాల […]
హాంకాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంతో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. చైనాలో మొదటి దశలో కరోనా బారిన 2,32,000 మంది పడి ఉంటారని అంచనా వేస్తున్నారు. హాంకాంగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫెంగ్‌వూ నేతృత్వంలో చేసిన అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడవుతున్నాయి.
చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం… ఇప్పటి వరకు ఆ దేశంలో 82,789 మందికి కరోనా పాజిటీవ్‌గా నమోదవగా.. 4,632 మంది కరోనాతో మరణించారు. కాగా, విస్తృత ప్రమాణాల ప్రకారం లెక్కిస్తే చైనా ఆరోగ్య కమిషన్ చెప్పిన సంఖ్యకంటే నాలుగు రెట్లు ఎక్కువ మందికి ఈ వైరస్ సోకినట్లు అంచనా వేస్తున్నామని.. చైనా ప్రభుత్వం బాధితుల సంఖ్యను తగ్గించి చెబుతోందని వాళ్లు అన్నారు.
వాస్తవానికి చైనా ప్రభుత్వం వైరస్ బారిన పడిన వారిని గుర్తించడానికి ‘కరోనా వైరస్ కేసుల డెఫినేషన్’ అనే ప్రమాణికాన్ని విడుదల చేసింది. దీన్ని ఏడు రకాలుగా చైనా వర్గీకరించింది. కేసులను గుర్తించేందుకు, పరీక్షలు నిర్వహించేందుకు, చికిత్స అందించేందుకు ఈ నిర్వచనాలనే వాడేవారు. ఫిబ్రవరి 5న ఐదో డెఫినేషన్‌ను చైనా విడుదల చేసింది. దీని ప్రకారం కేసులను గుర్తించడం మొదలుపెట్టాక రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. దీంతో వారం రోజులకే ఆ డెఫినేషన్‌ను చైనా ఉపసంహరించుకుంది.
చైనాలో ఫిబ్రవరి 20 నాటికి 55 వేల కేసులు ఉన్నాయి. అదే డెఫినేషన్ ఉపసంహరించుకోకుంటే 2,32,000 కేసులు నమోదయ్యేవని హాంకాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు. కరోనా బారిన పడిన వాళ్లు, మరణించిన వాళ్లు ఎక్కువగానే ఉన్నా.. చైనా విడుదల చేసిన వివరాలు మార్గదర్శకాల ప్రకారం లేకపోవడంతో వాటిని లెక్కించలేదని.. ఆ మరణాలను కూడా కలపలేదని ఆ పరిశోధనలో తేల్చారు.
అయితే ఏప్రిల్ 17న వూహాన్ మృతుల సంఖ్యను చైనా 50 శాతం పెంచడం.. బాధితుల సంఖ్యను కూడా పెంచడం పలు అనుమానాలకు తావిస్తున్నట్లు పలు దేశాలు వ్యాఖ్యానించాయి.
ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాలు…. చైనా సవరణలు, బాధితుల సంఖ్య లెక్కింపు విషయంలో చేస్తున్న పొరపాట్లను బాహాటంగానే విమర్శిస్తున్నాయి. ఇప్పుడు వీరి విమర్శలకు హాంకాంగ్ యూనివర్సిటీ అధ్యయనం మరింత బలం చేకూరుస్తోంది.