కరోనా గురించి చైనాకు నవంబర్‌లోనే తెలుసా..?

చైనాలోని వూహాన్‌లో డిసెంబర్ రెండో వారంలో కరోనా తొలి కేసు నమోదైందని.. ఆ తర్వాత అది ప్రపంచమంతా పాకినట్లు ఇప్పటికీ అందరూ విశ్వసిస్తున్నారు. కాని అమెరికా మాత్రం కరోనా విషయంలో చైనా చెప్పే విషయాలేవీ నమ్మడం లేదు. కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తి విషయంలో చైనా నిర్లక్ష్యంపై అగ్రరాజ్యం అమెరికా మరో సారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కోవిడ్-19 గురించిన సమచారం ఎంతో ముందుగానే తెలిసినా.. కావాలనే ఆలస్యంగా ప్రపంచానికి చెప్పిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ […]

Advertisement
Update:2020-04-24 08:05 IST

చైనాలోని వూహాన్‌లో డిసెంబర్ రెండో వారంలో కరోనా తొలి కేసు నమోదైందని.. ఆ తర్వాత అది ప్రపంచమంతా పాకినట్లు ఇప్పటికీ అందరూ విశ్వసిస్తున్నారు. కాని అమెరికా మాత్రం కరోనా విషయంలో చైనా చెప్పే విషయాలేవీ నమ్మడం లేదు. కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తి విషయంలో చైనా నిర్లక్ష్యంపై అగ్రరాజ్యం అమెరికా మరో సారి ఆగ్రహం వ్యక్తం చేసింది.

కోవిడ్-19 గురించిన సమచారం ఎంతో ముందుగానే తెలిసినా.. కావాలనే ఆలస్యంగా ప్రపంచానికి చెప్పిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆరోపించారు.

చైనాకు కరోనా వైరస్‌కు సంబంధించిన విషయాలు నవంబర్‌లోనే తెలిసినా.. చాన్నాళ్ల పాటు దాచి పెట్టిందని ఆయన మండిపడ్డారు. నవంబర్‌లోనే వైరస్‌ను గుర్తించారని.. డిసెంబర్ రెండో వారానికే వాళ్ల వద్ద పూర్తి సమాచారం ఉండి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వూహాన్‌లో తొలుత వెలుగులోనికి వచ్చిన సార్స్ కోవ్-2 అసలు నమూనాలు సహా వైరస్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అమెరికా కోరుతోందని పాంపియో అన్నారు. కాని చైనా వైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని తొలి సారిగా డిసెంబర్ 31న ప్రపంచానికి చెప్పిందని.. అప్పుడు కూడా దాని పేరేంటో చెప్పకుండా.. వింత లక్షణాలున్న న్యుమోనియా కేసులు వూహాన్‌లో నమోదవుతున్నట్లు తెలిపిందన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరి 4న దీనికి సంబంధించిన ప్రకటన చేసింది. ఆ తర్వాతే పూర్తి సమాచారాన్ని ప్రపంచదేశాలతో పంచుకున్నారు. అసలు నవంబర్‌లోనే వైరస్ గుర్తించినప్పుడు అప్పుడే సమాచారం ఎందుకు పంచుకోలేదు..? తొలినాళ్లలో గుర్తించిన సమాచారం పంచుకుంటే దానిని ఎలా కట్టడి చేయాలో ప్రపంచ దేశాలకు అవగాహన వచ్చేది కదా అని పాంపియో ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయంలో చైనా, డబ్ల్యూహెచ్‌వో చాలా పెద్ద తప్పు చేశాయని.. ప్రపంచాన్ని హెచ్చరించడంలో కావాలనే నిర్లక్ష్యం చేశాయని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ఊరికే వదిలిపెట్టమని.. రాబోయే రోజుల్లో లోతైన దర్యప్తు నిర్వహించనున్నట్లు చెప్పారు.

Tags:    
Advertisement

Similar News