కరోనా విలయతాండవం: ఆంధ్రప్రదేశ్లో 132... తెలంగాణలో 127
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్.. విలయ తాండవం చేస్తోంది. కొత్తగా పాజిటివ్ వచ్చిన 21 కేసులతో.. ఆంధ్రప్రదేశ్ లో కేసులు.. తెలంగాణను మించిపోయాయి. ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 132 కు చేరాయి. నెల్లూరు జిల్లాలో 17.. ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో చెరో 2 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే.. గుంటూరు జిల్లాలో 20.. కృష్ణా, కడప జిల్లాలో 15 చొప్పున.. […]
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్.. విలయ తాండవం చేస్తోంది. కొత్తగా పాజిటివ్ వచ్చిన 21 కేసులతో.. ఆంధ్రప్రదేశ్ లో కేసులు.. తెలంగాణను మించిపోయాయి. ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 132 కు చేరాయి. నెల్లూరు జిల్లాలో 17.. ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో చెరో 2 కేసులు నమోదయ్యాయి.
జిల్లాల వారీగా చూస్తే.. గుంటూరు జిల్లాలో 20.. కృష్ణా, కడప జిల్లాలో 15 చొప్పున.. పశ్చిమ గోదావరి జిల్లాలో 14.. విశాఖ జిల్లాలో 11.. తూర్పు గోదావరి జిల్లాలో 9.. అనంతపురం జిల్లాలో 2.. కర్నూలు జిల్లాలో 1 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇక తెలంగాణ విషయానికి వస్తే.. బుధవారం ఒక్కరోజే 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 127కు పెరిగింది. ఈ వ్యాధి ప్రభావంతో గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు.. యశోద ఆసుపత్రిలో ఒకరు చనిపోయినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మొత్తంగా ఈ వ్యాధి కారణంగా చనిపోయిన వారి సంఖ్య తెలంగాణలో 9కి చేరింది. తాజాగా చనిపోయిన ముగ్గురూ.. మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారిగా అధికారులు గుర్తించారు.
రెండు రాష్ట్రాల సరళిని పరిశీలిస్తే.. ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారి కారణంగానే వైరస్ వ్యాప్తి చెందుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే.. మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారి పూర్తి వివరాలు తెలుసుకునేలా.. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే.. కరోనా వ్యాప్తికి అనుకూలంగా ఉన్న మార్గాలు గుర్తించి.. మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.