లాక్‌డౌన్ పొడిగింపు వార్తలు అవాస్తవం " కేంద్రం

దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయాలనే ఉద్దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. కాగా, లాక్‌డౌన్ మరి కొన్ని రోజులు పొడిగించనున్నారని మీడియాలో విస్తృతంగా వార్తలు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో కూడా దీనిపై చర్చ జరుగుతోంది. ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్‌ను మరో 15 రోజుల నుంచి నెల రోజుల వరకు పెంచే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. లాక్‌డౌన్‌ను మరిన్ని రోజులు […]

Advertisement
Update:2020-03-30 06:54 IST

దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయాలనే ఉద్దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. కాగా, లాక్‌డౌన్ మరి కొన్ని రోజులు పొడిగించనున్నారని మీడియాలో విస్తృతంగా వార్తలు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో కూడా దీనిపై చర్చ జరుగుతోంది. ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్‌ను మరో 15 రోజుల నుంచి నెల రోజుల వరకు పెంచే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

లాక్‌డౌన్‌ను మరిన్ని రోజులు పెంచుతామని వస్తున్న ఊహాగానాలు తనను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని.. అలాంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయట్లేదని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా స్పష్టం చేశారు. ఏప్రిల్ 14 నాటికి దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్రాలు కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నాయి. కాబట్టి ఇప్పట్లో లాక్‌డౌన్ పొడిగింపు అనేది ఊహ తప్ప వాస్తవం కాదని ఆయన అన్నారు.

కాగా, గత రాత్రి నుంచి అన్ని రాష్ట్రాల సరిహద్దులను మూసేయాలని కేంద్రం అల్టిమేటం జారీ చేసింది. వలస కార్మికులను క్వారంటైన్ చేయాలని.. జాతీయ రహదారుల పక్కనే క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. కరోనా తీవ్రతను సాధ్యమైనంత తగ్గించేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం దేశంలో 1,071 మంది కరోనా బాధితులు ఉండగా ఇప్పటి వరకు 29 మంది మృతి చెందారు.

Tags:    
Advertisement

Similar News