తెలంగాణ పదవ తరగతి పరీక్షలు వాయిదా

తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో పదో తరగతి విద్యార్థుల ఆరోగ్యంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. దీనిపై ఇవాళ కోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు వాదనలు విన్న న్యాయస్థానం పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించింది. రేపు జరగాల్సిన పరీక్షను యధాతథంగా నిర్వహించాలని.. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు జరగాల్సిన పరీక్షలను మాత్రం […]

Advertisement
Update:2020-03-20 09:10 IST

తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో పదో తరగతి విద్యార్థుల ఆరోగ్యంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. దీనిపై ఇవాళ కోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు వాదనలు విన్న న్యాయస్థానం పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించింది.

రేపు జరగాల్సిన పరీక్షను యధాతథంగా నిర్వహించాలని.. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు జరగాల్సిన పరీక్షలను మాత్రం వాయిదా వేసి వాటికి కొత్త తేదీలను ప్రకటించాలని సూచించింది.

అలాగే ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు జరగాల్సిన పరీక్షలపై అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది.

హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు పరీక్షల రీషెడ్యూల్‌పై కసరత్తు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం లోపు కొత్త టైంటేబుల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News