కాంగ్రెస్ కు షాక్... ఈరోజే మధ్యప్రదేశ్‌లో బలపరీక్ష
కాంగ్రెస్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్షపై సుప్రీంకోర్టు కీలకతీర్పును వెల్లడించింది. అసెంబ్లీలో శుక్రవారం బలపరీక్ష నిర్వహించాలని స్పీకర్‌ను ఆదేశించింది. సాయంత్రం 5 గంటల లోగా బలపరీక్షను వీడియో రికార్డింగ్ చేయాలని కూడా సూచించింది. బలపరీక్షను 15 రోజుల పాటు వాయిదా వేయాలన్న కాంగ్రెస్ అభ్యర్ధనను న్యాయస్థానం తోసిపుచ్చింది. మధ్యప్రదేశ్ రాజకీయాలపై సుప్రీంకోర్టులో వాడివేడి చర్చలు జరిగాయి. బలపరీక్షను వాయిదా వేస్తే ఎమ్మెల్యేల బేరసారాలు జరుగుతాయని సుప్రీం వ్యాఖ్యానించింది. కమల్‌నాథ్ సర్కార్ అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని […]
కాంగ్రెస్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్షపై సుప్రీంకోర్టు కీలకతీర్పును వెల్లడించింది. అసెంబ్లీలో శుక్రవారం బలపరీక్ష నిర్వహించాలని స్పీకర్‌ను ఆదేశించింది. సాయంత్రం 5 గంటల లోగా బలపరీక్షను వీడియో రికార్డింగ్ చేయాలని కూడా సూచించింది. బలపరీక్షను 15 రోజుల పాటు వాయిదా వేయాలన్న కాంగ్రెస్ అభ్యర్ధనను న్యాయస్థానం తోసిపుచ్చింది.
మధ్యప్రదేశ్ రాజకీయాలపై సుప్రీంకోర్టులో వాడివేడి చర్చలు జరిగాయి. బలపరీక్షను వాయిదా వేస్తే ఎమ్మెల్యేల బేరసారాలు జరుగుతాయని సుప్రీం వ్యాఖ్యానించింది. కమల్‌నాథ్ సర్కార్ అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించింది. 22 ఎమ్మెల్యేల రాజీనామాతో కమల్‌నాథ్ సర్కార్ మైనారిటీలో పడిపోయింది. సింధియా వర్గానికి చెందిన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో పతనం అంచుకు చేరుకుంది.
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 స్థానాలు ఉన్నాయి, రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 228మందిలో 22మంది రాజీనామా చేశారు. వారిలో ఆరుగురు మంత్రుల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు . దీంతో అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 222కు పడిపోయింది. కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే 112 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.
అయితే స్పీకర్ మిగిలిన 16మంది ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 206కు పడిపోతుంది. ప్రభుత్వానికి కావలసిన మెజార్టీ 104కు చేరుతుంది. అప్పుడు కాంగ్రెస్ బలం 92కు పడిపోతుంది. స్వతంత్రులు నలుగురు, బీఎస్పీ ఇద్దరు, ఎస్పీ ఎమ్మెల్యేతో కలిపి 101కి చేరుతుంది. మెజార్టీకి మూడు స్థానాల దూరంలో నిలిచిపోతుంది. ఇదే జరిగితే 107మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటుంది.