కరోనా ఎఫెక్ట్: సింగపూర్ నుంచి వచ్చాడు... డాక్టర్లను చూసి పరారయ్యాడు
కరోనా కథలు ఇంతింత కాదయా అన్నట్టుంది పరిస్థితి. అనుమానితులు కొందరైతే.. వ్యాధి నిర్థారణ అయిన వారు మరి కొందరు. ఇలాంటి వార్తల్లో ఈ విషయం అయితే ప్రత్యేకం. కచ్చితంగా ప్రత్యేకం. అదేంటంటే.. సింగపూర్ నుంచి రాష్ట్రానికి వచ్చిన ఓ వ్యక్తి.. విశాఖ జిల్లా పాడేరుకు వెళ్లాడు. అది అతని స్వగ్రామం. చాలా రోజులకు వచ్చిన తమ కుటుంబసభ్యుడిని చూసి ఆ ఇంటివాళ్లు కూడా ఆనందించారు. అక్కడివరకూ బాగానే ఉంది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. సింగపూర్ […]
కరోనా కథలు ఇంతింత కాదయా అన్నట్టుంది పరిస్థితి. అనుమానితులు కొందరైతే.. వ్యాధి నిర్థారణ అయిన వారు మరి కొందరు. ఇలాంటి వార్తల్లో ఈ విషయం అయితే ప్రత్యేకం. కచ్చితంగా ప్రత్యేకం. అదేంటంటే.. సింగపూర్ నుంచి రాష్ట్రానికి వచ్చిన ఓ వ్యక్తి.. విశాఖ జిల్లా పాడేరుకు వెళ్లాడు. అది అతని స్వగ్రామం. చాలా రోజులకు వచ్చిన తమ కుటుంబసభ్యుడిని చూసి ఆ ఇంటివాళ్లు కూడా ఆనందించారు.
అక్కడివరకూ బాగానే ఉంది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. సింగపూర్ నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు? అంటూ వైద్య సిబ్బంది ఆరా తీశారు. అతడిని కలుసుకున్నారు. 14 రోజుల వరకు బయట తిరిగవద్దని చెప్పారు. ముందు జాగ్రత్తగానే ఈ చర్యలని వివరించారు. ఇలా ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు… ప్రతిరోజూ అతని ఆరోగ్య పరిస్థితిపై తెలుసుకునేందుకు వస్తుండడంతో.. సదరు సింగపూర్ రిటర్న్ యువకుడు… అసహనానికి గురయ్యాడు.
ఎవరికీ చెప్పా పెట్టకుండా సెల్ ఫోన్ స్విచాఫ్ చేసి పరారయ్యాడు. అధికారులు అతని ఇంటికి వెళ్లి వాకబు చేస్తే.. కుటుంబసభ్యులు కూడా వాగ్వాదానికి దిగారట. చుట్టుపక్కల వాళ్లు అంతా తమను అంటరానివారిగా చూస్తున్నారని ఆవేదన చెందారట. అయినా.. అధికారులు వారిని విడిచిపెట్టకుండా.. సదరు యువకుడి చిరునామా గురించి ప్రశ్నించి ప్రశ్నించి విఫలమయ్యారు. చివరికి.. ఆ ఇంటికి విద్యుత్ కనెక్షన్ కట్ చేశారు.
ప్రజలెవరికీ ఇబ్బంది కలగవద్దన్న కారణంగానే.. తాము ఈ చర్యలు తీసుకుంటుంటే సహకరించాల్సింది పోయి ఇలా ప్రవర్తిస్తారా.. అని అధికారులు కూడా ఆవేదనకు గురయ్యారట. ఇదీ సంగతి.