ఐపీఎల్ వాయిదాతో ఎంత నష్టం?

కరోనా వైరస్ దెబ్బతో కోట్ల రూపాయల దెబ్బ కంటికి ఏమాత్రం కనిపించని కరోనా వైరస్ దెబ్బతో ప్రపంచ ఆర్థికవ్యవస్థలు మాత్రమే కాదు…అగ్రరాజ్యాలు అమెరికా, ఫ్రాన్స్, చైనా, జపాన్, ఇంగ్లండ్ తో పాటు… భారత్, ఇరాన్ లాంటి దేశాలు సైతం కుదేలైపోతున్నాయి. ఇంతకాలమూ గ్లోబలైజేషన్ అంటూ సరిహద్దులు బార్లా తెరిచిన దేశాలన్నీ… కరోనా వైరస్ తమ తమ దేశాలలోకి ఏ రూపంలో చొరబడుతుందోనన్న భయంతో ఇప్పుడు తలుపులు మూసేసుకొంటున్నాయి. విమాన సర్వీసులు రద్దు చేయటమే కాదు… విదేశీయులకు వీసాలు ఇవ్వటాన్ని […]

Advertisement
Update:2020-03-15 13:30 IST
  • కరోనా వైరస్ దెబ్బతో కోట్ల రూపాయల దెబ్బ

కంటికి ఏమాత్రం కనిపించని కరోనా వైరస్ దెబ్బతో ప్రపంచ ఆర్థికవ్యవస్థలు మాత్రమే కాదు…అగ్రరాజ్యాలు అమెరికా, ఫ్రాన్స్, చైనా, జపాన్, ఇంగ్లండ్ తో పాటు… భారత్, ఇరాన్ లాంటి దేశాలు సైతం కుదేలైపోతున్నాయి.

ఇంతకాలమూ గ్లోబలైజేషన్ అంటూ సరిహద్దులు బార్లా తెరిచిన దేశాలన్నీ… కరోనా వైరస్ తమ తమ దేశాలలోకి ఏ రూపంలో చొరబడుతుందోనన్న భయంతో ఇప్పుడు తలుపులు మూసేసుకొంటున్నాయి. విమాన సర్వీసులు రద్దు చేయటమే కాదు… విదేశీయులకు వీసాలు ఇవ్వటాన్ని నిలిపివేశాయి.

భారత్ లో సైతం….

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం భారత్ లో సైతం కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్ర్ర ప్రభుత్వాలు కరోనా ఎమర్జెన్సీని ప్రకటించాయి. పాఠశాలలు, సినిమాహాల్స్, మాల్స్ సైతం మూసేవేస్తున్నట్లు ప్రకటించాయి.

భారత ప్రభుత్వ సూచనల మేరకు భారత క్రీడారంగం సైతం తన కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించింది. భారత క్రీడారంగానికే తలమానికంగా నిలిచే.. వేలకోట్ల రూపాయల వ్యాపారం ఐపీఎల్ సైతం దుకాణాన్ని తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది.

మార్చి 29న ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ పోటీలను ఏప్రిల్ 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీ యాజమాన్యాలతో అత్యవసర సమావేశం నిర్వహించి… లాభనష్టాలు, ప్రత్యామ్నాయాల గురించి సవివరంగా చర్చించింది.

ఫ్రాంచైజీకి 300 కోట్ల నష్టం…

ఐపీఎల్ వాయిదాతో ..ఒక్కో ఫ్రాంచైజీ 200 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయల మేర నష్టపోయే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి.

ఐపీఎల్ వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించడంతోనే చాలావరకూ ఫ్రాంచైజీల యజమానుల మొకం చిన్నబోయింది. తమకు జరిగే నష్టాన్ని ఎలా పూడ్చుతారంటూ రాగం కూడా అందుకొన్నాయి.

మరోవైపు…ఐదేళ్లకు గాను 16000 కోట్ల రూపాయలకు పైగా పోసి అంతర్జాతీయ ప్రసారహక్కులు దక్కించుకొన్న స్టార్ ఇండియా సైతం… కరోనా దెబ్బతో తాము అపారంగా నష్టపోవాల్సి వస్తుందని భయపడుతోంది.

పోటీల వాయిదా కారణంగా ఏప్రిల్ 16 నుంచి మే 27 లోగా…మొత్తం 60 మ్యాచ్ లను రోజుకు రెండు చొప్పున నిర్వహించుకొంటూ పోయినా…తమ టీఆర్పీ రేటింగ్ దారుణంగా పడిపోనుందని అంచనా వేసింది.

ఒకవేళ… కరోనా వైరస్ శాంతిచకపోతే… ఐపీఎల్ సీజన్ కు సీజనే రద్దయితే…ఐపీఎల్ పాలకమండలి, బీసీసీఐతో పాటు భారత ప్రభుత్వానికి సైతం కోట్ల రూపాయల నష్టం తప్పదని, భారత జీడీపీలో ఐపీఎల్ ద్వారా జరిగే ఆర్థిక కార్యకలాపాలు 24 శాతం వరకూ ఉన్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చైర్మన్ సౌరవ్ గంగూలీ మాటల్లో చెప్పాలంటే…కరోనా వైరస్ బారిన పడకుండా బతికి ఉంటే బలుసాకైనా తిని బతకవచ్చు. తమకు క్రికెట్, ఆదాయం కంటే… అభిమానులు, దేశప్రజల ప్రాణాలే ముఖ్యమని..అన్నీ సక్రమంగా ఉంటేనే ఆ తర్వాత ఆటలని..ఫ్రాంచైజీల సమావేశంలో చెప్పడం గమనార్హం.

Tags:    
Advertisement

Similar News