సీమ‌లో మ‌రో వికెట్ డౌన్... టీడీపీకి ఇక క‌ష్ట‌కాల‌మే !

రాయ‌ల‌సీమ‌లో అధికార పార్టీలోకి వ‌ల‌స‌లు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే జ‌మ్మ‌ల‌మడుగు టీడీపీ నేత రామ‌సుబ్బారెడ్డి వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. పులివెందుల స‌తీష్‌రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ కండువా క‌ప్పుకునేందుకు రెడీగా ఉన్నారు. వైసీపీలో ప్లేస్ లేని నేత‌లు ప్రొద్దుటూరు వ‌ర‌ద‌రాజులు రెడ్డి, క‌మ‌లాపురం వీర‌శివారెడ్డి లాంటి నేత‌లు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు క‌ర్నూలు జిల్లాలో వికెట్ల డౌన్ మొద‌లైంది. మాజీ మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి సోద‌రుడు కేఈ ప్ర‌భాక‌ర్ వంతు వ‌చ్చింది. ఆయ‌న పార్టీ మారేందుకు […]

Advertisement
Update:2020-03-13 04:37 IST

రాయ‌ల‌సీమ‌లో అధికార పార్టీలోకి వ‌ల‌స‌లు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే జ‌మ్మ‌ల‌మడుగు టీడీపీ నేత రామ‌సుబ్బారెడ్డి వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. పులివెందుల స‌తీష్‌రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ కండువా క‌ప్పుకునేందుకు రెడీగా ఉన్నారు. వైసీపీలో ప్లేస్ లేని నేత‌లు ప్రొద్దుటూరు వ‌ర‌ద‌రాజులు రెడ్డి, క‌మ‌లాపురం వీర‌శివారెడ్డి లాంటి నేత‌లు సైలెంట్ అయిపోయారు.

ఇప్పుడు క‌ర్నూలు జిల్లాలో వికెట్ల డౌన్ మొద‌లైంది. మాజీ మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి సోద‌రుడు కేఈ ప్ర‌భాక‌ర్ వంతు వ‌చ్చింది. ఆయ‌న పార్టీ మారేందుకు రెడీ అవుతున్నార‌ట‌. తెలుగుదేశం పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ట‌. పార్టీ త‌న‌కు ఏం చేయలేద‌నే కోపంలో ఉన్నార‌ట‌.

టీడీపీని వీడేందుకు రెడీ అవుతున్న కేఈ ప్ర‌భాక‌ర్‌…ఈ మ‌ధ్యాహ్నం కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం అవుతున్నార‌ట‌. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో త‌న అనుచ‌రులకు టికెట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని ఆవేద‌న చెందుతున్నార‌ట‌.

అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిన స‌మ‌యం నుంచి కేఈ ప్ర‌భాక‌ర్ పార్టీ మారుతార‌ని ప్రచారం జ‌రుగుతోంది. చివ‌ర‌కు ఇప్పుడు ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది. మొత్తానికి క‌ర్నూలులో కీల‌క‌మైన కేఈ కుటుంబం నుంచి ఓ నేత బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. మిగ‌తా నేత‌ల ప‌రిస్థితి ఏంటో చూడాలి.

Tags:    
Advertisement

Similar News