ఏప్రిల్ లో విస్తరణ.... రోజా, అంబటికి బెర్త్ దక్కేనా?
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించినట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో అధికారికంగా ప్రకటన వెలువడకపోయినా.. రెండు పరిణామాలు ఈ ఊహలకు కేంద్రాలుగా నిలుస్తున్నాయి. ఒకటి.. స్థానిక ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను మంత్రులకే అప్పగించడం, ఓడితే పదవులు పోతాయని స్పష్టంగా ముందే చెప్పడం. రెండు.. మండలి రద్దు ఖాయమన్న నేపథ్యంలో మంత్రులుగా ఉన్న ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్, మోపిదేవికి రాజ్యసభ సభ్యత్వం ఖాయం చేయడం. స్థానిక ఎన్నికల తర్వాత.. […]
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించినట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో అధికారికంగా ప్రకటన వెలువడకపోయినా.. రెండు పరిణామాలు ఈ ఊహలకు కేంద్రాలుగా నిలుస్తున్నాయి.
ఒకటి.. స్థానిక ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను మంత్రులకే అప్పగించడం, ఓడితే పదవులు పోతాయని స్పష్టంగా ముందే చెప్పడం. రెండు.. మండలి రద్దు ఖాయమన్న నేపథ్యంలో మంత్రులుగా ఉన్న ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్, మోపిదేవికి రాజ్యసభ సభ్యత్వం ఖాయం చేయడం.
స్థానిక ఎన్నికల తర్వాత.. ఎక్కడైనా ప్రతికూల ఫలితాలు వస్తే.. కనీసం ఇద్దరు నుంచి ముగ్గురి వరకూ మంత్రులు.. మాజీలుగా మారి.. ఎమ్మెల్యేలుగానే కొనసాగే అవకాశం ఉంది. అప్పటికే ఖాళీ కాబోతున్న పిల్లి సుభాష్, మోపిదేవి బెర్త్ లతో కలిపితే.. కనీసం నాలుగైదు మంత్రి పదవులు ఖాళీ అయ్యే అవకాశాలు కూడా మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ కారణంగానే.. వచ్చే నెలలో.. అంటే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక.. కేబినెట్ విస్తరణ ఉండొచ్చన్న వాదన బలపడుతోంది. ఈ క్రమంలోనే.. పదవులు ఆశించేవారి పేర్లూ బయటికి వస్తున్నాయి. పార్టీకి మొదటి నుంచి బలమైన వాయిస్ గా ఉంటున్న రోజా, అంబటి రాంబాబు.. గతంలోనే మంత్రి పదవులు ఆశించి భంగపడ్డారు. కారణాలు ఏవైనా.. వారు మాత్రం పదవులు దక్కించుకోలేకపోయారు. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.
సామాజిక సమీకరణాల కోటాలో.. విడదల రజనీతో పాటు.. పొన్నాడ సతీష్ వంటి నాయకులు కూడా పదవులు ఆశిస్తున్నారు. మరి.. వీరితోనే ఆ మంత్రి పదవులు భర్తీ అవుతాయా.. లేదంటే కొత్తవారికి అవకాశం దక్కుతుందా? అసలు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా.. ఉండదా.. అన్న చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా నడుస్తోంది.