ఈసారి చరణ్ ఓటు ఎవరికి?

ఓవైపు అనీల్ రావిపూడి. మరోవైపు గౌతమ్ తిన్ననూరి. ఇంకోవైపు వంశీ పైడిపల్లి. ఈ ముగ్గురిలో ఎవరికి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనేది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ మారింది. ప్రస్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్ కంప్లీట్ అయిన వెంటనే వీళ్ల ముగ్గురిలో ఒకరితో చరణ్ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. సరిలేరు నీకెవ్వరు సక్సెస్ అయిన వెంటనే రామ్ చరణ్, అనీల్ రావిపూడి మధ్య స్టోరీ డిస్కషన్లు జరిగాయి. అటు గౌతమ్ తిన్ననూరి కూడా రామ్ చరణ్ కు ఓ […]

Advertisement
Update:2020-03-09 12:30 IST

ఓవైపు అనీల్ రావిపూడి. మరోవైపు గౌతమ్ తిన్ననూరి. ఇంకోవైపు వంశీ పైడిపల్లి. ఈ ముగ్గురిలో ఎవరికి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనేది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ మారింది. ప్రస్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్ కంప్లీట్ అయిన వెంటనే వీళ్ల ముగ్గురిలో ఒకరితో చరణ్ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది.

సరిలేరు నీకెవ్వరు సక్సెస్ అయిన వెంటనే రామ్ చరణ్, అనీల్ రావిపూడి మధ్య స్టోరీ డిస్కషన్లు జరిగాయి. అటు గౌతమ్ తిన్ననూరి కూడా రామ్ చరణ్ కు ఓ కూల్ లవ్ స్టోరీని వినిపించాడు. ఇక వంశీ పైడిపల్లి తనదైన స్టయిలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ స్టోరీని వినిపించాడు.

ఈ మూడు కథలూ రామ్ చరణ్ కు నచ్చాయి. అయితే వీటిలో ఏది బౌండెడ్ స్క్రిప్ట్ తో లేదు. కాబట్టి ముగ్గుర్నీ రామ్ చరణ్ బౌండెడ్ స్క్రిప్ట్ కోరాడు. వీళ్లు తయారుచేసే స్క్రిప్టుల్లో ఏది నచ్చితే దానికే గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. అలాఅని మిగతా స్క్రిప్టుల్ని పక్కనపెట్టేయదలుచుకోలేదు చరణ్. వీలైతే ఈ ముగ్గురిలో ఇద్దరితో సినిమాలు చేయాలనుకుంటున్నాడు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు ఉంది. ఆ రోజున అతడి నెక్ట్స్ సినిమాపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

Tags:    
Advertisement

Similar News