కియా ఎక్కడికీ పోవట్లేదు... ధృవీకరించిన కొరియా..!
ఏపీలోని అనంతపురం జిల్లాలో కొన్ని కోట్ల పెట్టుబడితో ప్రారంభించిన దక్షిణ కొరియా కియా మోటార్స్ సంస్థ ఈ మధ్య తమ వాహనాలను ఇండియన్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. దేశంలోని ఏ రాష్ట్రానికైనా ఏపీలోని అనంతపురం ఫ్యాక్టరీ నుంచే వాహనాలు డెలివరీ చేస్తున్నారు. గత సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఈ ఫ్యాక్టరీ నుంచి ఈ మధ్యే వాహనాలు కమర్షియల్‌గా మార్కెట్ లోనికి రిలీజ్ అయ్యాయి. కాగా, ఈ సంస్థ ఏపీ నుంచి తరలిపోతోందని వార్తలు వచ్చాయి. దీనిపై దక్షిణ […]
ఏపీలోని అనంతపురం జిల్లాలో కొన్ని కోట్ల పెట్టుబడితో ప్రారంభించిన దక్షిణ కొరియా కియా మోటార్స్ సంస్థ ఈ మధ్య తమ వాహనాలను ఇండియన్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. దేశంలోని ఏ రాష్ట్రానికైనా ఏపీలోని అనంతపురం ఫ్యాక్టరీ నుంచే వాహనాలు డెలివరీ చేస్తున్నారు.
గత సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఈ ఫ్యాక్టరీ నుంచి ఈ మధ్యే వాహనాలు కమర్షియల్‌గా మార్కెట్ లోనికి రిలీజ్ అయ్యాయి. కాగా, ఈ సంస్థ ఏపీ నుంచి తరలిపోతోందని వార్తలు వచ్చాయి. దీనిపై దక్షిణ కొరియా దేశపు అత్యున్నత వాణిజ్య విభాగం కొరియా- ట్రేడ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ(కోట్రా) ఖండించింది. కియా తరలిపోతుందన్న వార్తలు, ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది.
కియా మోటార్స్ తరలిపోతోందని మీడియాలో వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలేనని.. అవన్నీ కావాలని రాసిన వార్తలేనని దక్షిణ కొరియా అధికార ప్రతినిధి తెలియజేశారు..