సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు.. ఈ వార్త మీ కోసమే
ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాదు.. నియామకాలు అయిన తర్వాత వారితో సరిగా పని చేయించుకుంటేనే ప్రభుత్వాలు అనుకున్న ప్రగతిని సాధించే అవకాశం ఉంటుంది. ఈ దిశగా సిబ్బంది తమ విధి నిర్వహణలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తేనే అనుకున్న ఫలితాలు సాధ్యమవుతాయి. అందుకే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు, వాలంటీర్లకు విధుల హాజరులో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను.. సంక్షేమ పథకాల అమలులో కీలకంగా పరిగణిస్తున్న ప్రభుత్వం.. ఇకపై వారి […]
ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాదు.. నియామకాలు అయిన తర్వాత వారితో సరిగా పని చేయించుకుంటేనే ప్రభుత్వాలు అనుకున్న ప్రగతిని సాధించే అవకాశం ఉంటుంది. ఈ దిశగా సిబ్బంది తమ విధి నిర్వహణలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తేనే అనుకున్న ఫలితాలు సాధ్యమవుతాయి. అందుకే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు, వాలంటీర్లకు విధుల హాజరులో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది.
సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను.. సంక్షేమ పథకాల అమలులో కీలకంగా పరిగణిస్తున్న ప్రభుత్వం.. ఇకపై వారి హాజరు నమోదుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తెచ్చింది.
ఉదయం 10 గంటలకు విధుల్లోకి హాజరయ్యే ముందు.. సాయంత్రం 5.30 గంటల తర్వాత విధుల నుంచి ఆ రోజుకు సెలవు తీసుకునే ముందు సదరు యాప్ లో హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాల ప్రకారంగానే.. జీతాల చెల్లింపు ఉండే అవకాశం ఉంది.
ప్రతి పథకాన్ని ప్రభుత్వం సచివాలయాలకు, వాలంటీర్లకు ముడి పెడుతోంది. అసలైన లబ్ధిదారుల ఎంపికలో వీరు ఇచ్చే వివరాలనే ఆధారంగా తీసుకుంటోంది. ఈ కారణంగా.. ఈ రెండు విభాగాలు పరిపాలనలో కీలకంగా మారాయి. అందుకే.. సిబ్బంది హాజరు విషయంలో నిర్లక్ష్యం కూడదని.. ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే బయో మెట్రిక్ హాజరు నిర్ణయమని తెలిపాయి.