తెలుగోడు... ఇంటర్నేషనల్ అవార్డును దక్కించుకున్నాడు

పుల్లెల గోపీచంద్.. బ్యాడ్మింటన్ ప్రపంచానికే కాదు.. యావత్ భారతానికి పరిచయం అక్కర్లేని పేరు. తన ఆటతీరుతోనే కాదు.. శిక్షుకుడిగానూ ఎన్నో సంచలనాలు ఆయన సొంతం. ప్రపంచ టైటిళ్లను అవలీలగా సాధించే ప్లేయర్లను తయారు చేయగలగడం ఆయనకే ప్రత్యేకం. ప్రపంచంలో ఎన్ని బ్యాడ్మింటన్ శిక్షణ సంస్థలు ఉన్నా.. గోపీచంద్ అకాడమీకి క్రీడాకారులు ఇచ్చే గౌరవం వేరు. అందుకే.. అతనంటే అందరికీ అంత గౌరవం. ఆయన శిక్షణలో రాటుదేలిన సైనా నెహ్వాల్, సింధుతో పాటు మరెంతో మంది క్రీడాకారులు.. బ్యాడ్మింటన్ […]

Advertisement
Update:2020-02-09 06:35 IST

పుల్లెల గోపీచంద్.. బ్యాడ్మింటన్ ప్రపంచానికే కాదు.. యావత్ భారతానికి పరిచయం అక్కర్లేని పేరు. తన ఆటతీరుతోనే కాదు.. శిక్షుకుడిగానూ ఎన్నో సంచలనాలు ఆయన సొంతం. ప్రపంచ టైటిళ్లను అవలీలగా సాధించే ప్లేయర్లను తయారు చేయగలగడం ఆయనకే ప్రత్యేకం. ప్రపంచంలో ఎన్ని బ్యాడ్మింటన్ శిక్షణ సంస్థలు ఉన్నా.. గోపీచంద్ అకాడమీకి క్రీడాకారులు ఇచ్చే గౌరవం వేరు. అందుకే.. అతనంటే అందరికీ అంత గౌరవం.

ఆయన శిక్షణలో రాటుదేలిన సైనా నెహ్వాల్, సింధుతో పాటు మరెంతో మంది క్రీడాకారులు.. బ్యాడ్మింటన్ లో సంచలనాలు సృష్టంచారు. ఇప్పుడు గోపీచంద్ కూడా.. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డును అందుకున్న ఏకైక భారతీయుడిగా గోపీచంద్ గుర్తింపు పొందారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తనకు దక్కిన పురస్కారాన్ని భారతీయ కోచ్ లందరికీ దక్కినట్టుగా భావిస్తున్నట్టు చెప్పారు.

తనకు ఈ స్థాయి దక్కడంలో కారణాలుగా నిలిచిన భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్, కేంద్రం, క్రీడా మంత్రిత్వ శాఖ, ఒలింపిక్ అసోసియేషన్ లకు గోపీచంద్ కృతజ్ఞతలు తెలిపారు. బ్యాడ్మింటన్ రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా.. గోపీచంద్ కు 2019 ఐవోసీ జీవిత సాఫల్య కోచ్ అవార్డు దక్కింది.

Tags:    
Advertisement

Similar News