అప్పుడు మెట్రో... ఇప్పుడు కియా... సేమ్ స్క్రిప్ట్‌...

ఏపీ నుంచి కియా త‌రలిపోతోంది… త‌మిళ‌నాడుకు కియా కార్ల ప‌రిశ్ర‌మ యూనిట్ పోతోంది… అంటూ రెండు రోజులుగా టీడీపీ, దాని అనుకూల మీడియా ఊద‌ర‌గొడుతున్న వార్త‌. అయితే ఆ వార్త‌లో నిజం లేద‌ని తేలింది. యెల్లో మీడియాలో వ‌చ్చే వార్త‌ల‌కు విశ్వ‌స‌నీయ‌త లేద‌ని ఈ ఘ‌ట‌న‌తో మరోసారి తేలింది. అందుకే రాయిట‌ర్స్ పేరిట నాట‌కం మొద‌లుపెట్టారు… అందులో కూడా ఫెయిల్ అయ్యారు. ఇటు అమ‌రావ‌తిపై కూడా శేఖ‌ర్ గుప్తా పేరిట ఓ వీడియో చేయించారు. ఆయ‌న తీరుపై […]

Advertisement
Update:2020-02-07 05:13 IST

ఏపీ నుంచి కియా త‌రలిపోతోంది… త‌మిళ‌నాడుకు కియా కార్ల ప‌రిశ్ర‌మ యూనిట్ పోతోంది… అంటూ రెండు రోజులుగా టీడీపీ, దాని అనుకూల మీడియా ఊద‌ర‌గొడుతున్న వార్త‌. అయితే ఆ వార్త‌లో నిజం లేద‌ని తేలింది.

యెల్లో మీడియాలో వ‌చ్చే వార్త‌ల‌కు విశ్వ‌స‌నీయ‌త లేద‌ని ఈ ఘ‌ట‌న‌తో మరోసారి తేలింది. అందుకే రాయిట‌ర్స్ పేరిట నాట‌కం మొద‌లుపెట్టారు… అందులో కూడా ఫెయిల్ అయ్యారు. ఇటు అమ‌రావ‌తిపై కూడా శేఖ‌ర్ గుప్తా పేరిట ఓ వీడియో చేయించారు. ఆయ‌న తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతో ఆయ‌న సైలెంట్ అయ్యారు. క‌నీసం స‌మాధానం కూడా ఇవ్వ‌లేదు.

ఇప్పుడు రాయిట‌ర్స్ పేరిట నాట‌కం మొద‌లుపెట్టారు. రోజురోజుకు యెల్లోమీడియా క్రెడిబులిటీ గాల్లో పెట్టిన దీపమైంది. వారి వార్త‌ల‌ను నమ్మే పరిస్థితి లేకుండా పోతోంది.

స‌రిగ్గా 2014లో కూడా యెల్లోమీడియా ఇదే త‌ర‌హాలో హైద‌రాబాద్‌లో కుట్ర చేసింది. మెట్రోప్రాజెక్టు నుంచి త‌ప్పుకుంటామ‌ని ఎల్‌ అండ్‌ టి కేంద్రానికి లేఖ‌రాసినట్లు ఓ లేఖ‌తో హంగామా చేసింది. హైద‌రాబాద్ భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థ‌కం అంటూ.. వార్తలు రాసింది… బ్యాన‌ర్ క‌థ‌నాలు వండి వార్చింది.

తెలంగాణ ప్రభుత్వ వైఖరితో ఎల్‌ అండ్‌ టి సంస్థ ప్రాజెక్టు నుంచి వైదొలిగే పరిస్థితి ఏర్పడిందని అప్ప‌ట్లో టీడీపీ నేత‌లు ఆరోప‌ణ‌లు గుప్పించారు. అంతేకాదు…. అస‌లు మెట్రో ప్రారంభ‌మవుతుందా? అనే సందేహాలను కూడా వెలిబుచ్చారు. అసలు ప్రాజెక్టును ఎల్‌ అండ్‌ టి నిర్వహిస్తుందా ? లేక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందా ? లేక కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళుతుందా ? అని కూడా క‌థ‌నాలు రాశారు.

కానీ ఇప్పుడు ఐదేళ్ల త‌ర్వాత చూస్తే ఏమైంది. మెట్రో ప్రారంభ‌మైంది. జోరుగా న‌డుస్తోంది. ఇవాళ జేబీఎస్‌-
ఎంజీబీఎస్ మెట్రో లైన్ కు కూడా సీఎం కేసీఆర్ పచ్చ జెండా ఊపుతున్నారు.

మొత్తానికి అప్పుడు మెట్రోపై బుర‌ద‌జ‌ల్లిన విధంగానే… ఇప్పుడు కియా కార్ల‌పై తెలుగుదేశం, ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థ‌లు బుర‌ద జ‌ల్లుతున్నాయి. కొద్దిగా ఓపిక ప‌డితే కియా కార్ల ఉత్ప‌త్తి సాఫీగా జ‌రిగిపోతుంది… ఈ నోళ్ల‌కు మూత‌లు ప‌డ‌తాయని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News