ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ కింగ్ జోకోవిచ్
8వసారి టైటిల్ నెగ్గిన సెర్బియన్ స్టార్ ఫైనల్లో డోమినిక్ థీమ్ పై గెలుపు సెర్బియన్ స్టార్ నొవాక్ జోకోవిచ్ …ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ కింగ్ ను తానేనని మరోసారి చాటుకొన్నాడు. 2020 సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను సొంతం చేసుకోడం ద్వారా.. తిరిగి ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ కైవసం చేసుకోగలిగాడు. మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనా వేదికగా ముగిసిన సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ ట్రోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్లో జోకోవిచ్ విజేతగా నిలిచాడు. ఆస్ట్ర్రియా ఆటగాడు […]
- 8వసారి టైటిల్ నెగ్గిన సెర్బియన్ స్టార్
- ఫైనల్లో డోమినిక్ థీమ్ పై గెలుపు
సెర్బియన్ స్టార్ నొవాక్ జోకోవిచ్ …ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ కింగ్ ను తానేనని మరోసారి చాటుకొన్నాడు. 2020 సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను సొంతం చేసుకోడం ద్వారా.. తిరిగి ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ కైవసం చేసుకోగలిగాడు.
మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనా వేదికగా ముగిసిన సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ ట్రోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్లో జోకోవిచ్ విజేతగా నిలిచాడు. ఆస్ట్ర్రియా ఆటగాడు డోమనిక్ థీమ్ తో..నాలుగు గంటలపాటు సాగిన టైటిల్ సమరంలో రెండో సీడ్ జోకోవిచ్ ఐదుసెట్ల విజయం సాధించాడు.
ఒకదశలో 1-2 సెట్లతో వెనుకబడిన జోకోవిచ్.. ఆఖరి రెండుసెట్లు నెగ్గడం ద్వారా విజయం సొంతం చేసుకొన్నాడు. ట్రోఫీతో పాటు 21 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని సైతం అందుకొన్నాడు.
జోకో ఖాతాలో 8వ టైటిల్…
హార్డ్ కోర్టు టెన్నిస్ లో మొనగాడిగా పేరుపొందిన జోకోవిచ్…రికార్డు స్థాయిలో 8వసారి ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ ట్రోఫీ అందుకొన్నాడు. నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఫైనల్లో 6-4,4-6,2-6, 6-3, 6-4 తో డోమనిక్ ను అధిగమించి…తన ఖాతాలో 8వ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టైటిల్ ను జమ చేసుకోగలిగాడు.
గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలో క్లే కోర్టు టెన్నిస్ ఫ్రెంచ్ ఓపెన్లో రాఫెల్ నడాల్ 12 టైటిల్స్ నెగ్గితే…గ్రాస్ కోర్టు టెన్నిస్ వింబుల్డన్ లో ఫెదరర్ 8 టైటిల్స్ నెగ్గి …గ్రాస్ కోర్టు టెన్నిస్ లో తానే బాస్ నని చాటుకొన్నాడు.
ఇప్పుడు హార్డ్ కోర్ట్ టెన్నిస్ లో జోకోవిచ్ 8సార్లు ఆస్ట్ర్రేలియన్ టైటిల్ నెగ్గడం ద్వారా వారేవ్వా అనిపించుకొన్నాడు. ఫెదరర్ 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్, నడాల్ 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్, జోకోవిచ్ 17 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో …మొదటి మూడుస్థానాలలో కొనసాగుతున్నారు.
గత 13 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టోర్నీలలో ఎనిమిదిసార్లు జోకోవిచ్ మాత్రమే విజేతగా నిలవడం ఓ రికార్డుగా మిగిలిపోతుంది.