విశాఖ నుంచి జగన్ పాలన... ముహూర్తం ఖరారు

ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న జగన్ సంకల్పానికి మండలిలో అవరోధాలు ఏర్పడ్డప్పటికీ సీఎం మాత్రం వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. 3 రాజధానుల బిల్లు ప్రస్తుతం సెలెక్ట్ కమిటీకి పంపడం..రాజధాని మార్పుపై హైకోర్టులో పిటీషన్లు దాఖలు కావడంతో విచారణ జరుగుతున్నా…. జగన్ సర్కారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖని పరిపాలన రాజధానిగా మార్చడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతోంది. వైసీపీ అధిష్టానం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. […]

Advertisement
Update:2020-01-30 07:17 IST

ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న జగన్ సంకల్పానికి మండలిలో అవరోధాలు ఏర్పడ్డప్పటికీ సీఎం మాత్రం వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. 3 రాజధానుల బిల్లు ప్రస్తుతం సెలెక్ట్ కమిటీకి పంపడం..రాజధాని మార్పుపై హైకోర్టులో పిటీషన్లు దాఖలు కావడంతో విచారణ జరుగుతున్నా…. జగన్ సర్కారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖని పరిపాలన రాజధానిగా మార్చడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతోంది.

వైసీపీ అధిష్టానం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సీఎం జగన్ మార్చి 25న ఉగాది నాడు తెలుగు నూతన సంవత్సరం రోజున విశాఖ నుంచి పాలన ప్రారంభించాలని డిసైడ్ అయినట్టు సమాచారం. ఉగాది తెలుగు సంవత్సరాది కావడంతో ఆ రోజునే విశాఖ నుంచి పని ప్రారంభించాలని డిసైడ్ అయ్యారట.

వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ముఖ్యమంత్రి కార్యాలయం సిద్ధం చేయాలని విశాఖపట్నం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. జగన్ అదే రోజున విశాఖ నుంచి పాలన మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.

ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకాశం.. విశాఖలో సీఎం కార్యాలయం మిలీనియం టవర్స్ నుంచి పనిచేస్తుందని తెలుస్తోంది. దీనిని రాష్ట్ర సచివాలయంగా అభివృద్ధి చేస్తున్నారు.

సెక్రెటేరియట్ తరలింపుకు కొంత ఆలస్యం జరిగినా.. సీఎం కార్యాలయం మాత్రం విశాఖకు షిఫ్ట్ కావడం ఖాయమని.. మార్చి 25 ఉగాది నుంచి విశాఖ కేంద్రంగానే పాలన సాగుతుందని వైసీపీ అధిష్టాన వర్గాలు ఖాయంగా చెబుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News