ఎన్టీఆర్ కు వెన్నుపోటు ఆరోపణలపై... చంద్రబాబు వివరణ ఏంటంటే!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. తనపై చాలా కాలంగా ఉన్న వెన్నుపోటు ఆరోపణలపై స్పందించాడు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి.. పార్టీని లాక్కుని అధికారంలోకి వచ్చాడని ఆయనపై దశాబ్దాలుగా ఆరోపణలు ఉన్నాయి. వాటిపై వివరణ ఇచ్చి.. తనపై ఉన్న మచ్చను చెరిపేసుకునే ప్రయత్నం చేశాడు.. చంద్రబాబు. మండలి రద్దుకు శాసనసభ ఆమోదం అనంతరం మాట్లాడిన ఆయన.. పనిలో పనిగా ఈ విషయాన్నీ ప్రస్తావించాడు. “మా మామకు వెన్నుపోటు పొడిచానని జగన్ నన్ను పదే పదే అంటున్నారు. కానీ.. నాటి […]

Advertisement
Update:2020-01-28 05:34 IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. తనపై చాలా కాలంగా ఉన్న వెన్నుపోటు ఆరోపణలపై స్పందించాడు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి.. పార్టీని లాక్కుని అధికారంలోకి వచ్చాడని ఆయనపై దశాబ్దాలుగా ఆరోపణలు ఉన్నాయి. వాటిపై వివరణ ఇచ్చి.. తనపై ఉన్న మచ్చను చెరిపేసుకునే ప్రయత్నం చేశాడు.. చంద్రబాబు. మండలి రద్దుకు శాసనసభ ఆమోదం అనంతరం మాట్లాడిన ఆయన.. పనిలో పనిగా ఈ విషయాన్నీ ప్రస్తావించాడు.

“మా మామకు వెన్నుపోటు పొడిచానని జగన్ నన్ను పదే పదే అంటున్నారు. కానీ.. నాటి పరిస్థితుల ప్రకారం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఆ నిర్ణయం తీసుకున్నాం. భావి తరాలకు పార్టీని అందించాలనే ఆ నిర్ణయం తీసుకున్నాం. తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాం. నాయకుడిగా ఎన్టీఆర్ ఫొటోనే పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం” అని చంద్రబాబు వివరణ ఇచ్చాడు.

మండలి రద్దుపైనా.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా తాము సిద్ధాంతాలు మార్చుకున్నామే తప్ప.. మాట తప్పలేదని అన్నాడు. గతంలో తెదేపా సిద్ధాంతం ప్రకారం ఎన్టీఆర్.. మండలిని రద్దు చేశారని చెప్పాడు. వైఎస్ వచ్చాక మండలిని పునరుద్ధరిస్తామంటే వద్దని అడ్డుకున్నది నిజమేనని ఒప్పుకొన్నాడు. చివరికి ప్రజల డిమాండ్ ప్రకారమే కొనసాగించామని వివరణ ఇచ్చాడు.

మొత్తానికి.. మండలి రద్దుకు అసెంబ్లీ ఆమోదం.. గతంలోని ఎన్నో ఆసక్తికర విషయాలను నేతల నోట ప్రస్తావనకు వచ్చేలా చేస్తోంది.

Tags:    
Advertisement

Similar News