టెస్టుల్లో ఇంగ్లండ్ జంట ప్రపంచ రికార్డులు

5 లక్షల పరుగుల తొలిజట్టు ఇంగ్లండ్ సాంప్రదాయ టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ జట్టు రెండు అరుదైన ప్రపంచ రికార్డులు నమోదు చేసింది. ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరి టెస్టులో ఈ జంట ప్రపంచ రికార్డులు సాధించింది. క్రికెట్ అనగానే…టీ-20ల్లో 200కు పైగా పరుగులు, వన్డేల్లో 450కి పైగా స్కోరు, టెస్టు క్రికెట్ ఓ ఇన్నింగ్స్ లో 700కు పైగా స్కోర్ల గురించి మాత్రమే మనకు […]

Advertisement
Update:2020-01-27 04:02 IST
  • 5 లక్షల పరుగుల తొలిజట్టు ఇంగ్లండ్

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ జట్టు రెండు అరుదైన ప్రపంచ రికార్డులు నమోదు చేసింది. ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరి టెస్టులో ఈ జంట ప్రపంచ రికార్డులు సాధించింది.

క్రికెట్ అనగానే…టీ-20ల్లో 200కు పైగా పరుగులు, వన్డేల్లో 450కి పైగా స్కోరు, టెస్టు క్రికెట్ ఓ ఇన్నింగ్స్ లో 700కు పైగా స్కోర్ల గురించి మాత్రమే మనకు తెలుసు.

అయితే…క్రికెట్ కు మరోపేరుగా నిలిచే ఇంగ్లండ్ టెస్ట్ జట్టు మాత్రం 5 లక్షల పరుగులు సాధించిన తొలిజట్టుగా చరిత్ర సృష్టించింది.
జోహెన్స్ బర్గ్ వాండరర్స్ స్టేడియం వేదికగా జరిగిన సిరీస్ లోని ఆఖరి టెస్టు తొలిరోజు ఆటలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ సింగిల్ తీయడం ద్వారా… 13 దశాబ్దాల టెస్ట్ చరిత్రలో..ఐదులక్షల పరుగును సాధించిన ఆటగాడిగా నిలిచిపోయాడు.

ఇంగ్లండ్ జట్టు 5 లక్షల టెస్టు పరుగుల మైలురాయిని చేరిన తొలిజట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 1877 నుంచి 2020 వరకూ నిరంతరాయంగా టెస్టు మ్యాచ్ లు ఆడుతూ వస్తున్న ఇంగ్లండ్ 1022వ టెస్టులో కానీ ఐదులక్షల పరుగులు పూర్తి చేయలేకపోయింది.

విదేశీగడ్డపై 500 టెస్టుల రికార్డు…

అంతేకాదు…విదేశాలలో 500 టెస్టుమ్యాచ్ లు ఆడిన ఏకైక, తొలిజట్టుగా కూడా ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. పోర్ట్ ఎలిజబెత్ లోని సెయింట్ జార్జి పార్క్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడోటెస్ట్ ద్వారా ఇంగ్లండ్ 500వ విదేశీ టెస్టును ఆడగలిగింది.

భారత్ 2 లక్షల 73వేల, 518 పరుగులు…

టెస్టు క్రికెట్లో 2020 న్యూజిలాండ్ సిరీస్ వరకూ 830 మ్యాచ్ లు ఆడిన ఆస్ట్ర్రేలియా 4లక్షల 32వేల 706 పరుగులతో ఇంగ్లండ్ తర్వాతి స్తానంలో నిలిచింది.

టెస్ట్ క్రికెట్ ప్రపంచ నంబర్ వన్ జట్టు భారత్ మాత్రం 1932 నుంచి బంగ్లాదేశ్ తో ముగిసిన 2019 డే-నైట్ టెస్ట్ మ్యాచ్ వరకూ ఆడిన 540 టెస్టుల ద్వారా 2 లక్షల 73వేల, 518 పరుగులు సాధించడం ద్వారా మూడోస్థానంలో నిలిచింది.

ఎందరో గొప్పగొప్ప క్రికెటర్లను అందించిన వెస్టిండీస్ జట్టు 545 మ్యాచ్ ల్లో 2 లక్షల 70 వేల 441 పరుగులతో నాలుగోస్థానంలో నిలిచింది.

విదేశీగడ్డపై భారత్ 268 టెస్టులు…

భారతజట్టు విదేశీగడ్డపై 268 టెస్టులు ఆడి 51 విజయాలు, 113 పరాజయాలు, 104 డ్రాల రికార్డుతో ఉంది. ఇంగ్లండ్ తర్వాత అత్యధిక విదేశీటెస్టులు (404 ) ఆడినజట్టుగా ఆస్ట్ర్రేలియా నిలిచింది.

Tags:    
Advertisement

Similar News