అక్కడ కారు, కామ్రేడ్లు కలిశారు... అధికారంలోకి వచ్చారు !
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. అనుకున్నట్లే గులాబీ దళానికి పట్టం కట్టారు ప్రజలు. అయితే అక్కడక్కడా ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మక్తల్‌కు ప్రాధాన్యత ఉంది. దీని పక్కనే ఉండేది అమరచింత . 2009కి ఇది ఓ నియోజకవర్గం. అయితే నియోజకవర్గ పునర్విభజనతో ఈ సీటు కనుమరుగైంది. కొత్తకోట, మక్తల్ నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు ఈ అమరచింత మున్సిపల్‌లో విచిత్ర తీర్పు ఇచ్చారు జనం. అమరచింతలో పది వార్డులు ఉన్నాయి. ఇందులో […]
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. అనుకున్నట్లే గులాబీ దళానికి పట్టం కట్టారు ప్రజలు. అయితే అక్కడక్కడా ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మక్తల్‌కు ప్రాధాన్యత ఉంది. దీని పక్కనే ఉండేది అమరచింత . 2009కి ఇది ఓ నియోజకవర్గం. అయితే నియోజకవర్గ పునర్విభజనతో ఈ సీటు కనుమరుగైంది. కొత్తకోట, మక్తల్ నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు ఈ అమరచింత మున్సిపల్‌లో విచిత్ర తీర్పు ఇచ్చారు జనం.
అమరచింతలో పది వార్డులు ఉన్నాయి. ఇందులో మూడుసీట్లు టీఆర్ఎస్ గెలిచింది. సీపీఎం -2, బీజేపీ-1, సీపీఐ-1, కాంగ్రెస్-1, టీడీపీ-1, ఇండిపెండెంట్-1 గెలిచారు. పది సీట్లు ఏడు పార్టీలు గెలిచాయి. దీంతో ఇక్కడ అధికారం కోసం పార్టీలు కలవడం అనివార్యమైంది.
ఇటు ఫలితాలు రాగానే అధికార టీఆర్ఎస్ తో కామ్రేడ్లు చర్చలు జరిపారు. మూడు సీట్ల టీఆర్ఎస్‌కు సీపీఎం మద్దతు ఇచ్చింది. దీంతో పాటు సీపీఐ కూడా కలిసి వచ్చింది. ఇంకేముంది మెజార్టీకి చేరువయ్యారు. ఇండిపెండెంట్ కూడా ఎలాగూ అధికార పక్షం వైపు వచ్చారు.
టీఆర్ఎస్‌కు చెందిన మంగమ్మ నాగభూషణం గౌడ్ ఛైర్మన్ కాబోతున్నారు. సీపీఎంకు చెందిన గోపి వైస్ ఛైర్మన్ కాబోతున్నారు. టీఆర్ఎస్‌తో ఇప్పటివరకూ ఏ ఎన్నికల్లో సీపీఎం పొత్తు పెట్టుకోలేదు. కానీ అమరచింతలో మాత్రం అధికార పార్టీతో కలిసి అధికారం పంచుకుంటోంది. మొత్తానికి కామ్రేడ్లు కూడా టీఆర్ఎస్ తో అధికారాన్ని పంచుకోబోతున్నారు.