శాసన మండలి రద్దు ఖాయమే(నా?)!

మూడు రాజధానుల ఏర్పాటు దిశగా పరిపాలన వికేంద్రీకరణ బిల్లును శాసనసభలో అత్యంత సులువుగా గట్టెక్కించింది జగన్ ప్రభుత్వం. ఇప్పుడు.. శాసనసమండలి వంతు వచ్చింది. 71 రూలింగ్ నిబంధనల ప్రకారం.. శాసనమండలిలో తెలుగుదేశం సభ్యులు.. పరిపాలన వికేంద్రీకరణ బిల్లును సభ ముందుకు రాకుండా అడ్డుకున్నారు. ముందుగా.. తాము డిమాండ్ చేసిన అంశాలపై చర్చకు పట్టుబట్టారు. ఇది నిబంధనలకు లోబడే ఉన్న కారణంగా.. మండలి ఛైర్మన్ బిల్లుకు బ్రేకు వేశారు. ఇక్కడే.. వైసీపీ నేతలు అంతర్మథనంలో పడ్డట్టు సమాచారం. తెలుగుదేశం […]

Advertisement
Update:2020-01-21 15:33 IST

మూడు రాజధానుల ఏర్పాటు దిశగా పరిపాలన వికేంద్రీకరణ బిల్లును శాసనసభలో అత్యంత సులువుగా గట్టెక్కించింది జగన్ ప్రభుత్వం. ఇప్పుడు.. శాసనసమండలి వంతు వచ్చింది. 71 రూలింగ్ నిబంధనల ప్రకారం.. శాసనమండలిలో తెలుగుదేశం సభ్యులు.. పరిపాలన వికేంద్రీకరణ బిల్లును సభ ముందుకు రాకుండా అడ్డుకున్నారు. ముందుగా.. తాము డిమాండ్ చేసిన అంశాలపై చర్చకు పట్టుబట్టారు.

ఇది నిబంధనలకు లోబడే ఉన్న కారణంగా.. మండలి ఛైర్మన్ బిల్లుకు బ్రేకు వేశారు. ఇక్కడే.. వైసీపీ నేతలు అంతర్మథనంలో పడ్డట్టు సమాచారం. తెలుగుదేశం నేతలు ఇలాగే ప్రవర్తిస్తూ పోతే.. మున్ముందు మరింత ఇబ్బంది తలెత్తడం ఖాయమన్న అభిప్రాయం ఆ పార్టీ నాయకత్వంలో వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. అందుకే.. శాసనమండలని రద్దు చేస్తే.. ప్రభుత్వానికి ఆర్థిక భారమూ తగ్గుతుందన్న ఆలోచన వైసీపీ నాయకత్వం చేస్తోందని అమరావతి వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మూడు రాజధానుల బిల్లుకు సంబంధించి మండలిలో వచ్చే ఫలితం ఆధారంగా వైఎస్ జగన్ ప్రభుత్వం.. కచ్చితంగా ఈ దిశగా ఆలోచన చేసే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో సాధ్యాసాధ్యాలు ఎలా ఉంటాయి? న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందా.. శాసనమండలి రద్దుకు నిర్ణయం తీసుకుంటే… టీడీపీ నేతలు, ఎమ్మెల్సీలు ఎలా స్పందిస్తారు? అన్నవిషయాలపైనా జగన్ అండ్ కో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

ఏది ఏమైనా.. మూడు రాజధానుల అంశం.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కీలకంగా మారబోతోంది. ఇప్పటికే ఈ దిశగా అమలు పరుస్తున్న చర్యల్లో.. ఓ అంకం పూర్తవగా.. రెండో అంకంపై ఎన్నో పరిణామాలు ఆధారపడి ఉన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇదే.. ఆంధ్రా రాజకీయాలను ఆసక్తికరంగా మారుస్తోంది. దేశ వ్యాప్తంగా సుదీర్ఘ చర్చకు కారణంగా నిలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News