రోహిత్ కు ఐసీసీ బెస్ట్ వన్డే క్రికెటర్ అవార్డు

దీపక్ చహార్, కొహ్లీలకు ఐసీసీ అవార్డులు 2019 సంవత్సరానికి ఐసీసీ వివిధ విభాగాలలో అత్యుత్తమ క్రికెటర్ల అవార్డులు ప్రకటించింది. భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కొహ్లీ, స్వింగ్ బౌలర్ దీపక్ చహార్ వన్డే, టీ-20, స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డులకు ఎంపికయ్యారు. గత సీజన్లో ప్రపంచ అత్యుత్తమ వన్డే క్రికెటర్ అవార్డును రోహిత్ శర్మ గెలుచుకొన్నాడు. ఇంగ్లండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ లో ఐదు శతకాలతో పాటు మరో రెండు సెంచరీలతో అత్యధిక […]

Advertisement
Update:2020-01-16 02:33 IST
  • దీపక్ చహార్, కొహ్లీలకు ఐసీసీ అవార్డులు

2019 సంవత్సరానికి ఐసీసీ వివిధ విభాగాలలో అత్యుత్తమ క్రికెటర్ల అవార్డులు ప్రకటించింది. భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కొహ్లీ, స్వింగ్ బౌలర్ దీపక్ చహార్ వన్డే, టీ-20, స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డులకు ఎంపికయ్యారు.

గత సీజన్లో ప్రపంచ అత్యుత్తమ వన్డే క్రికెటర్ అవార్డును రోహిత్ శర్మ గెలుచుకొన్నాడు. ఇంగ్లండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ లో ఐదు శతకాలతో పాటు మరో రెండు సెంచరీలతో అత్యధిక పరుగులు సాధించిన రోహిత్ శర్మను ఐసీసీ బెస్ట్ వన్డే క్రికెటర్ అవార్డు వరించింది. రోహిత్ మొత్తం 28 వన్డేలలో 1409 పరుగులు సాధించాడు. ఇందులో 648 పరుగులు ప్రపంచకప్ ద్వారా వచ్చినవే కావడం విశేషం.

 

భారత కెప్టెన్ విరాట్ కొహ్లీని స్పిరిట్ ఆఫ్ ది క్రికెటర్ అవార్డుకు ఐసీసీ ఎంపిక చేసింది. భారత స్వింగ్ బౌలర్ దీపక్ చహార్ ను టీ-20 విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన క్రికెటర్ అవార్డుకు ఎంపిక చేశారు. నాగపూర్ వేదికగా బంగ్లాదేశ్ తో ముగిసిన మ్యాచ్ లో దీపక్ చహార్ కేవలం 7 పరుగులకే 6 వికెట్లు పడగొట్టడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

బెన్ స్టోక్స్ కు సర్ గారీ సోబర్స్ అవార్డు…

2019 సంవత్సరానికి ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్ అవార్డును ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ గెలుచుకొన్నాడు. ఇంగ్లండ్ జట్టు వన్డే ప్రపంచకప్ గెలుచుకోడంతో పాటు… యాషెస్ సెంచరీ సాధించడం ద్వారా బెన్ స్టోక్స్ ప్రతిష్టాత్మక గారీ సోబర్స్ అవార్డు సాధించాడు.

టెస్ట్ క్రికెట్ అత్యుత్తమ బౌలర్ అవార్డును ఆస్ట్ర్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ సొంతం చేసుకొన్నాడు. కమిన్స్ మొత్తం 12 టెస్టుల్లో 59 వికెట్లు పడగొట్టడం ద్వారా ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బౌలర్ గా నిలిచాడు.

ఎమర్జింగ్ క్రికెటర్ గా మార్నుస్…

ఆస్ట్ర్రేలియా యువసంచలనం మార్నుల్ లాబ్ చేజ్ 2019 సంవత్సరానికి బెస్ట్ ఎమర్జింగ్ క్రికెటర్ అవార్డుకు ఎంపికయ్యాడు. మొత్తం 11 టెస్టుల్లో మార్నుస్ 1104 పరుగులు సాధించాడు.

2019 సీజన్ ప్రారంభంలో 110వ ర్యాంకులో ఉన్న మార్నుస్ …2019 డిసెంబర్ నాటికి 4వ ర్యాంక్ కు చేరుకోడం విశేషం.
రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ కు 2019 ఐసీసీ బెస్ట్ అంపైర్ అవార్డు దక్కింది.

Tags:    
Advertisement

Similar News