కొహ్లీ ఖాతాలో పరమచెత్త రికార్డు
10 వికెట్ల ఓటమి పొందిన భారత తొలి కెప్టెన్ భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకూ ఎన్నో గొప్పగొప్ప రికార్డులు సాధించిన కెప్టెన్ విరాట్ కొహ్లీ…తొలిసారిగా తనపేరుతో ఓ చెత్తరికార్డును సైతం మూటగట్టుకోవాల్సి వచ్చింది. వన్డే క్రికెట్ నాలుగో ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాతో ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా ముగిసిన తొలివన్డేలో 10 వికెట్ల పరాజయం పొందిన భారతజట్టుకు విరాట్ కొహ్లీ కెప్టెన్ గా ఉన్నాడు. గతంలో భారతజట్టు 1981లో న్యూజిలాండ్, 1997లో వెస్టిండీస్, 2000లో సౌతాఫ్రికా, 2005లో సౌతాఫ్రికా జట్లపైన […]
- 10 వికెట్ల ఓటమి పొందిన భారత తొలి కెప్టెన్
భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకూ ఎన్నో గొప్పగొప్ప రికార్డులు సాధించిన కెప్టెన్ విరాట్ కొహ్లీ…తొలిసారిగా తనపేరుతో ఓ చెత్తరికార్డును సైతం మూటగట్టుకోవాల్సి వచ్చింది.
వన్డే క్రికెట్ నాలుగో ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాతో ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా ముగిసిన తొలివన్డేలో 10 వికెట్ల పరాజయం పొందిన భారతజట్టుకు విరాట్ కొహ్లీ కెప్టెన్ గా ఉన్నాడు.
గతంలో భారతజట్టు 1981లో న్యూజిలాండ్, 1997లో వెస్టిండీస్, 2000లో సౌతాఫ్రికా, 2005లో సౌతాఫ్రికా జట్లపైన 10 వికెట్ల విజయాలు సాధించిన ఘనత సంపాదించింది. అయితే…తొలిసారిగా ఆస్ట్ర్రేలియా చేతిలో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడటం విరాట్ కొహ్లీ నాయకత్వానికి మాయనిమచ్చగా మిగిలిపోతుంది.
ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా ముగిసిన తొలివన్డేలో భారత్ 255 పరుగులు మాత్రమే సాధిస్తే…సమాధానంగా ఆస్ట్ర్రేలియా మరో 12.1 ఓవర్లు మిగిలి ఉండగానే…. వికెట్ నష్టపోకుండా 258 పరుగుల స్కోరుతో 10 వికెట్ల విజయం సొంతం చేసుకొంది.
వన్డే క్రికెట్లో రెండోర్యాంక్ జట్టు భారత్…నాలుగో ర్యాంకర్ ఆస్ట్ర్రేలియా చేతిలో ఇంత ఘోరంగా పరాజయం పొందడం ఇదే మొదటిసారి.