‘ఎస్వీబీసీ’ చైర్మన్ రేసులో ఉంది వీరే...

ప్రతిష్టాత్మక శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ) చైర్మన్ పదవి నుంచి నటుడు ఫృథ్వీరాజ్ వైదొలిగారు. ఆరోపణలు రావడంతో రాజీనామా చేశారు. ఇప్పుడు ఫృథ్వీ తప్పుకోవడంతో… ఈ ప్రతిష్టాత్మక పదవిలో ఎవరు ఉంటారన్న చర్చ వైసీపీలో సాగుతోంది. వైసీపీ వర్గాలు, మీడియా సంస్థల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. ఎస్వీబీసీ చైర్మన్ రేసులో ఇద్దరు ప్రముఖుల పేర్లు సీఎం జగన్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇందులో ఒకరు ప్రముఖ యాంకర్ , ప్రస్తుత 10టీవీ మేనేజింగ్ డైరెక్టర్ స్వప్న […]

Advertisement
Update:2020-01-14 07:06 IST

ప్రతిష్టాత్మక శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ) చైర్మన్ పదవి నుంచి నటుడు ఫృథ్వీరాజ్ వైదొలిగారు. ఆరోపణలు రావడంతో రాజీనామా చేశారు. ఇప్పుడు ఫృథ్వీ తప్పుకోవడంతో… ఈ ప్రతిష్టాత్మక పదవిలో ఎవరు ఉంటారన్న చర్చ వైసీపీలో సాగుతోంది.

వైసీపీ వర్గాలు, మీడియా సంస్థల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. ఎస్వీబీసీ చైర్మన్ రేసులో ఇద్దరు ప్రముఖుల పేర్లు సీఎం జగన్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.

ఇందులో ఒకరు ప్రముఖ యాంకర్ , ప్రస్తుత 10టీవీ మేనేజింగ్ డైరెక్టర్ స్వప్న సుందరి అని టాక్. ఈమె ప్రస్తుతం ఎస్వీబీసీ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు. సాక్షి టీవీ చానెల్ తో చాలాకాలంగా అనుబంధం కలిగి ఉన్నారు. స్వప్న జగన్ కుటుంబానికి చాలా దగ్గరైన వారు.. పైగా ఏ రాజకీయ పదవిలోనూ లేదు.

ఇక స్వప్న కాకుంటే ప్రచారంలో ఉన్న మరోపేరు టాలీవుడ్ దర్శకుడు శ్రీనివాస రెడ్డి. ఢమరుకం, కుబేరులు, టాటా బిర్లా మధ్యలో లైలా సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈయన కూడా ఎస్వీబీసీ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులు. దివంగత వైఎస్ కు సన్నిహితంగా మెలిగారు. వైసీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.

ఇక వీరే కాదు.. చంద్రబాబును వ్యతిరేకంగా మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు తెలిపిన మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణ రావు పేరు కూడా తెరపైకి వస్తోంది. ఈయన టీటీడీలో పనిచేయడం కూడా అదనపు బలం. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిలో ఒకరు ఎస్వీబీసీ చైర్మన్ కావచ్చని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News