సెంచూరియన్ టెస్టులో ఇంగ్లండ్ బోల్తా
ఐదు పరాజయాల తర్వాత సౌతాఫ్రికా విజయం ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో వరుస పరాజయాలతో డీలా పడిన సౌతాఫ్రికా జట్టు ఎట్టకేలకు తొలి విజయంతో ఊపిరిపీల్చుకొంది. ఇంగ్లండ్ తో సిరీస్ లో భాగంగా ప్రిటోరియాలోని సెంచూరియన్ పార్క్ వేదికగా జరిగిన తొలిటెస్టు 4వ రోజు ఆటలోనే ఇంగ్లండ్ ను సఫారీటీమ్ 107 పరుగులతో చిత్తు చేసి 1-0 ఆధిక్యం సంపాదించింది. మ్యాచ్ నెగ్గాలంటే 376 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో […]
- ఐదు పరాజయాల తర్వాత సౌతాఫ్రికా విజయం
ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో వరుస పరాజయాలతో డీలా పడిన సౌతాఫ్రికా జట్టు ఎట్టకేలకు తొలి విజయంతో ఊపిరిపీల్చుకొంది.
ఇంగ్లండ్ తో సిరీస్ లో భాగంగా ప్రిటోరియాలోని సెంచూరియన్ పార్క్ వేదికగా జరిగిన తొలిటెస్టు 4వ రోజు ఆటలోనే ఇంగ్లండ్ ను సఫారీటీమ్ 107 పరుగులతో చిత్తు చేసి 1-0 ఆధిక్యం సంపాదించింది.
మ్యాచ్ నెగ్గాలంటే 376 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 268 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ బర్న్స్ 84 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
సఫారీ బౌలర్లలో రబాడా 4 వికెట్లు, నోర్జే 3 వికెట్లు, కేశవ్ మహారాజ్ 2 వికెట్లు పడగొట్టారు. సౌతాఫ్రికా విజయంలో ప్రధానపాత్ర వహించిన వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ క్వింటన్ డీ కాక్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ విజయంతో సౌతాఫ్రికాకు 30 పాయింట్లు దక్కాయి. సిరీస్ లోని రెండోటెస్ట్ కేప్ టౌన్ వేదికగా జనవరి 3న ప్రారంభమవుతుంది. ఐదు వరుస పరాజయాల తర్వాత సౌతాఫ్రికా తొలివిజయం సాధించడం ద్వారా 2019 క్రికెట్ సీజన్ ను గెలుపుతో ముగించడం విశేషం.