తెలంగాణ కొత్త సీఎస్ గా సోమేష్ కుమార్

ఊగిసలాటకు తెరపడింది. తెలంగాణ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేష్ కుమార్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ ఎస్ కే జోషి ఈవాళ రిటైర్ అయ్యారు. సోమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా రిటైర్ అయిన ఎస్ కే జోషికి కేసీఆర్ ప్రభుత్వం మరో అద్భుతమైన అవకాశం ఇచ్చింది. ఆయనను తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. […]

Advertisement
Update:2019-12-31 12:42 IST

ఊగిసలాటకు తెరపడింది. తెలంగాణ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేష్ కుమార్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుత సీఎస్ ఎస్ కే జోషి ఈవాళ రిటైర్ అయ్యారు. సోమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.

కాగా రిటైర్ అయిన ఎస్ కే జోషికి కేసీఆర్ ప్రభుత్వం మరో అద్భుతమైన అవకాశం ఇచ్చింది. ఆయనను తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా సోమేష్ కుమార్ కు మరో మూడేళ్ల వరకూ పదవీ కాలం ఉంది. 2023 డిసెంబర్ 31 వరకూ సోమేష్ కుమార్ తెలంగాణ సీఎస్ గా కొనసాగనున్నారు. సోమేష్ కుమార్ స్వస్థలం బీహార్ రాష్ట్రం.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి 14 మంది వరకూ పోటీపడ్డారు. అయితే కేసీఆర్ మదిలో మాత్రం అజయ్ మిశ్రా లేదా సోమేష్ కుమార్ లను మాత్రమే ఎంపిక చేస్తారని ప్రభుత్వంలో చర్చ జరిగింది. ఎట్టకేలకు తెలంగాణ సీఎం కేసీఆర్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అయిన సోమేష్ కుమార్ వైపు మొగ్గు చూపి ఆయనను తెలంగాణ సీఎస్ గా నియమించారు.

Tags:    
Advertisement

Similar News