రాయపాటిపై సీబీఐ దాడులు

టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై సీబీఐ మెరుపుదాడులు చేస్తోంది. హైదరాబాద్, గుంటూరు, బెంగళూరులోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణం రాయపాటి తీసుకున్నారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన వ్యవహారంలోనే… రాయపాటిపై సీబీఐ దాడులు జరుగుతున్నాయి. రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. రాయపాటిపై సీబీఐ దాడులతో…. టీడీపీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. టీడీపీలో ఒక్క రాయపాటే కాకుండా చాలా మంది పెద్దలు…. బ్యాంకులను […]

Advertisement
Update:2019-12-31 06:04 IST

టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై సీబీఐ మెరుపుదాడులు చేస్తోంది. హైదరాబాద్, గుంటూరు, బెంగళూరులోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో సీబీఐ దాడులు నిర్వహిస్తోంది.

బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణం రాయపాటి తీసుకున్నారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన వ్యవహారంలోనే… రాయపాటిపై సీబీఐ దాడులు జరుగుతున్నాయి. రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. రాయపాటిపై సీబీఐ దాడులతో…. టీడీపీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.

టీడీపీలో ఒక్క రాయపాటే కాకుండా చాలా మంది పెద్దలు…. బ్యాంకులను వేల కోట్లకు ముంచారు. టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపిక అయిన సుజనాచౌదరి కూడా బ్యాంకులకు 6వేల కోట్లు ఎగ్గొట్టారు. ఆయనపై సీబీఐ, ఈడీ కేసులు కూడా నమోదు అయ్యాయి. దాంతో సుజనాచౌదరి బీజేపీలో చేరిపోయారు. అప్పటి నుంచి ఆయనపై కేసులు ముందుకు కదలడం లేదు. ఇంతలో రాయపాటిపై సీబీఐ దాడులు…. టీడీపీ వర్గాలను కలవరపెడుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News