విశాఖవన్డేలో భారత్ డూ ఆర్ డై సమరం

సిరీస్ కు గురిపెట్టిన కరీబియన్ ఆర్మీ భారత్- వెస్టిండీస్ జట్ల తీన్మార్ వన్డే షో లోని కీలక సమరానికి స్టీల్ సిటీ విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. మరికొద్దిగంటల్లో ప్రారంభమయ్యే ఈ పోటీ ఆతిథ్య భారత్ కు చావో …రేవో అన్నట్లుగా తయారయ్యింది. చెన్నై వేదికగా ముగిసిన తొలివన్డేలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన భారత్…సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే… ఈ మ్యాచ్ లో ఆరునూరైనా నెగ్గితీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు…బ్యాటింగ్ పవర్ […]

Advertisement
Update:2019-12-18 03:34 IST
  • సిరీస్ కు గురిపెట్టిన కరీబియన్ ఆర్మీ

భారత్- వెస్టిండీస్ జట్ల తీన్మార్ వన్డే షో లోని కీలక సమరానికి స్టీల్ సిటీ విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. మరికొద్దిగంటల్లో ప్రారంభమయ్యే ఈ పోటీ ఆతిథ్య భారత్ కు చావో …రేవో అన్నట్లుగా తయారయ్యింది.

చెన్నై వేదికగా ముగిసిన తొలివన్డేలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన భారత్…సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే… ఈ మ్యాచ్ లో ఆరునూరైనా నెగ్గితీరాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు…బ్యాటింగ్ పవర్ తో తొలివన్డేను నెగ్గిన విండీస్ టీమ్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ విజయాలతో సిరీస్ ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది.

విరాట్ పరుగుల అడ్డా విశాఖ…

విశాఖ వేదికగా ఆడిన పలు రకాల మ్యాచ్ ల్లో భారత కెప్టెన్ కమ్ స్టార్ ప్లేయర్ విరాట్ కొహ్లీకి కళ్లు చెదిరే రికార్డు ఉంది. రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు సాధంచిన ఘనత ఉంది. అంతేకాదు…విశాఖలో ఆడిన ఐదు వన్డేల్లో కొహ్లీ 300కు పైగా పరుగులు సైతం సాధించాడు.

భారత్ కు 6-2 రికార్డు…

విశాఖ వేదికగా ఇప్పటి వరకూ ఎనిమిది వన్డేలు ఆడిన భారతజట్టుకు 6 విజయాలు, 2 పరాజయాల రికార్డు ఉంది. దీనికితోడు రెండుజట్ల ఫేసే టు ఫేస్ రికార్డులు చూస్తే కరీబియన్ టీమ్ 64-63 విజయాల రికార్డుతో ఉంది.

బౌలర్లు కుదురుకొంటేనే…

బ్యాటింగ్ లో అత్యంత పటిష్టంగా ఉన్న భారత్…బౌలింగ్ విభాగంలో నిలకడలేమితో ఉక్కిరిబిక్కిరవుతోంది. మొత్తం ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లు సమన్వయంతో.. కరీబియన్ హిట్టర్లను కట్టడి చేయగలిగితేనే విజయం సాధించే అవకాశం ఉంటుంది.

ప్రధానంగా హోప్, హెడ్ మేయర్, పూరన్, చేజ్, పోలార్డ్ లాంటి సూపర్ హిట్టర్లను అదుపు చేయలేకపోతే కష్టాలు తప్పవు
స్వదేశీ వన్డే సిరీస్ ల్లో తొలిమ్యాచ్ ఓడిన ప్రతిసారీ…రెండోమ్యాచ్ లో నెగ్గటం భారత్ కు ఆనవాయితీగా వస్తోంది.

మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ కీలకపోరులో సైతం భారత్ విజేతగా నిలిచి సిరీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకోగలుగుతుందా…వేచిచూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News