ప్రపంచ బ్యాడ్మింటన్లో జపాన్ స్టార్ హవా

2019 సీజన్ ఫైనల్స్ విజేతలు కెంటో, చెన్ ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో జపాన్ సంచలనం కెంటో మెమోటో హవా కొనసాగుతోంది. 2019 సీజన్ ను అత్యధిక టైటిల్స్ తో ముగించడం ద్వారా తిరుగులేని ప్రపంచ నంబర్ వన్ గా అవతరించాడు. చైనాలోని గాంగ్జోవో వేదికగా ముగిసిన 2019 బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు ఫైనల్స్ టోర్నీ టైటి్ల్ ను సైతం గెలుచుకొన్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఇండోనీసియా ఆటగాడు ఆంటోనీ జింటింగ్ ను 17-21, 21-17, 21-14తో అధిగమించాడు. […]

Advertisement
Update:2019-12-16 04:35 IST
  • 2019 సీజన్ ఫైనల్స్ విజేతలు కెంటో, చెన్

ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో జపాన్ సంచలనం కెంటో మెమోటో హవా కొనసాగుతోంది. 2019 సీజన్ ను అత్యధిక టైటిల్స్ తో ముగించడం ద్వారా తిరుగులేని ప్రపంచ నంబర్ వన్ గా అవతరించాడు.

చైనాలోని గాంగ్జోవో వేదికగా ముగిసిన 2019 బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు ఫైనల్స్ టోర్నీ టైటి్ల్ ను సైతం గెలుచుకొన్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఇండోనీసియా ఆటగాడు ఆంటోనీ జింటింగ్ ను 17-21, 21-17, 21-14తో అధిగమించాడు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్ కెంటో మమోటో కు..ఇది రెండో టూర్ పైనల్స్ టైటిల్ కావడం విశేషం.

2019 సీజన్లో కెంటో నెగ్గిన సింగిల్స్ టైటిల్స్ సంఖ్య 11కు చేరింది. ప్రస్తుత సీజన్లో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ సాధించిన ప్లేయర్ కెంటో మాత్రమే.

తాయ్ జుకు చెన్ షాక్

మహిళల సింగిల్స్ టైటిల్ ను చైనా ప్లేయర్ చెన్ యూఫే కైవసం చేసుకొంది. ఫైనల్లో తైవాన్ ప్లేయర్, ప్రపంచ నంబర్ వన్ తాయ్ జు యింగ్ ను 12-21, 21-12, 21-17 తో అధిగమించింది.

తాయి జు ప్రత్యర్థిగా ఇప్పటి వరకూ 15సార్లు తలపడిన చెన్ కు ఇదే తొలి గెలుపు కావడం విశేషం. ఈ విజయంతో..చెన్ యూ ఫే ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ కు చేరుకోగా.. తాయ్ జు రెండో ర్యాంక్ కు పడిపోయింది.

భారత ప్లేయర్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధు గ్రూప్- ఏ లీగ్ దశ నుంచే ఇంటిదారి పట్టిన సంగతి తెలిసింందే.

Tags:    
Advertisement

Similar News