శాఫ్ గేమ్స్ లో భారత్ సరికొత్త రికార్డు

312 పతకాలతో భారత్ ఆగ్రస్థానం 2016 గేమ్స్ రికార్డును అధిగమించిన భారత్ నేపాల్ రాజధాని ఖాట్మండూ వేదికగా గత పదిరోజులుగా జరిగిన దక్షిణాసియా సమాఖ్య దేశాల13వ క్రీడలు…భారత్ సంపూర్ణ ఆధిపత్యంతో ముగిశాయి. సమాఖ్యలోని ఎనిమిదిదేశాల అథ్లెట్లు తలపడిన 27 క్రీడాంశాల ఈ సమరంలో భారత్ కు ఎదురేలేకుండా పోయింది. 2016 గేమ్స్ రికార్డు తెరమరుగు 1984 నుంచి జరుగుతూవస్తున్న ఈ క్రీడల్లో భారత్ పతకాల పట్టిక అగ్రభాగంలో నిలుస్తూ వస్తోంది. ప్రస్తుత 13వ క్రీడల్లో సైతం భారత్ గతంలో […]

Advertisement
Update:2019-12-11 05:58 IST
  • 312 పతకాలతో భారత్ ఆగ్రస్థానం
  • 2016 గేమ్స్ రికార్డును అధిగమించిన భారత్

నేపాల్ రాజధాని ఖాట్మండూ వేదికగా గత పదిరోజులుగా జరిగిన దక్షిణాసియా సమాఖ్య దేశాల13వ క్రీడలు…భారత్ సంపూర్ణ ఆధిపత్యంతో ముగిశాయి. సమాఖ్యలోని ఎనిమిదిదేశాల అథ్లెట్లు తలపడిన 27 క్రీడాంశాల ఈ సమరంలో భారత్ కు ఎదురేలేకుండా పోయింది.

2016 గేమ్స్ రికార్డు తెరమరుగు

1984 నుంచి జరుగుతూవస్తున్న ఈ క్రీడల్లో భారత్ పతకాల పట్టిక అగ్రభాగంలో నిలుస్తూ వస్తోంది. ప్రస్తుత 13వ క్రీడల్లో సైతం భారత్ గతంలో ఎన్నడూలేనన్ని పతకాలు సాధించి టేబుల్ టాపర్ గా నిలిచింది.

మొత్తం 487 మంది అథ్లెట్ల బృందంతో పతకాల వేటకు దిగిన భారత్ విశ్వరూపమే ప్రదర్శించింది. 312 పతకాలతో ..2016 గేమ్స్ లో సాధించిన 309 పతకాల రికార్డును అధిగమించింది.

పోటీల ఆఖరిరోజున జరిగిన బాక్సింగ్ ఫైనల్స్ లో భారత్ బంగారు పంట పండించుకోడం ద్వారా తన పతకాల వేటకు తెరదించింది. ముగింపు రోజున భారత్ 12 స్వర్ణ, 2 రజత, ఒక కాంస్య పతకాన్ని తన ఖాతాలో జమచేసుకోగలిగింది.

174 బంగారు పతకాలతో టాప్…

భారత్ సాధించిన మొత్తం 312 పతకాలలో 174 స్వర్ణాలు ఉన్నాయి. 93 రజత, 45 కాంస్య సైతం ఉన్నాయి. గత క్రీడలతో పోల్చిచూస్తే స్వర్ణాల సంఖ్య తగ్గినా.. ఓవరాల్ గా పతకాల సంఖ్యను మాత్రం పెంచుకోగలిగింది.

ఆతిథ్య నేపాల్ 206 పతకాలతో రెండు, శ్రీలంక 251 పతకాలతో మూడు స్థానాలలో నిలిచాయి. బంగ్లాదేశ్ , భూటాన్, మాల్దీవులు సైతం తమవంతుగా పతకాలు సాధించగలిగాయి.

మొత్తం మీద శాఫ్ గేమ్స్ సూపర్ పవర్ తానేనని భారత్ మరోసారి చాటుకోగలిగింది.

Tags:    
Advertisement

Similar News