'అర్జున్ సురవరం' సినిమా రివ్యూ
రివ్యూ : అర్జున్ సురవరం రేటింగ్ : 2.5/5 తారాగణం : నిఖిల్, లావణ్య త్రిపాఠి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, నాగినీడు, సత్య, కిశోర్, తరుణ్ అరోరా, ప్రగతి, విద్యుల్లేఖ రామన్ తదితరులు సంగీతం: సామ్ సి ఎస్ నిర్మాత : రాజ్ కుమార్ ఆకెళ్ల దర్శకత్వం : టి సంతోష్ వరుస డిజాస్టర్ లతో సతమతమయిన యువ హీరో నిఖిల్ ఇప్పుడు టి సంతోష్ దర్శకత్వంలో ‘అర్జున్ సురవరం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు […]
రివ్యూ : అర్జున్ సురవరం
రేటింగ్ : 2.5/5
తారాగణం : నిఖిల్, లావణ్య త్రిపాఠి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, నాగినీడు, సత్య, కిశోర్, తరుణ్ అరోరా, ప్రగతి, విద్యుల్లేఖ రామన్ తదితరులు
సంగీతం: సామ్ సి ఎస్
నిర్మాత : రాజ్ కుమార్ ఆకెళ్ల
దర్శకత్వం : టి సంతోష్
వరుస డిజాస్టర్ లతో సతమతమయిన యువ హీరో నిఖిల్ ఇప్పుడు టి సంతోష్ దర్శకత్వంలో ‘అర్జున్ సురవరం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కణితన్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకుల్ని అలరించిన ఈ చిత్రం చాలాకాలంగా వాయిదాపడుతూ ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది.
అర్జున్ సురవరం (నిఖిల్ సిద్ధార్థ్) ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా పని చేస్తూ ఉంటాడు. సాఫీగా సాగిపోతున్న తన జీవితం… ఒక స్కాంలో ఇరుక్కోవడంతో తలకిందులు అవుతుంది. తన సర్టిఫికెట్స్ అన్నీ ఫేక్ సర్టిఫికెట్స్ అనే ఆరోపణల వల్ల తన కెరియర్ రిస్క్ లో పడుతుంది. అదే సమయంలో ఈ స్కామ్ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని అర్జున్ నిర్ణయించుకుంటాడు. ఇలాంటి సమయంలో అర్జున్ ఏం చేశాడు? ఈ స్కామ్ వెనుక ఉన్నది ఎవరు? అర్జున్ ఈ మిస్టరీ ని ఎలా చేధిస్తాడు? చివరికి ఏమైంది? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
సినిమాలో ఉన్న ముఖ్యమైన ప్లస్ పాయింట్లలో ముందుగా చెప్పుకోవాల్సింది నిఖిల్ పర్ఫార్మెన్స్ గురించి. మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో నిఖిల్ చాలా ఎక్కువగా కష్టపడ్డాడని చెప్పవచ్చు. తన పాత్రని నిఖిల్ ప్రెజెంట్ చేసిన విధానం అందరిని కచ్చితంగా మెప్పిస్తుంది. తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించాడు నిఖిల్.
లావణ్య త్రిపాటి తన అందంతో మాత్రమే కాక నటనతో కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. పోసాని కృష్ణ మురళి మరియు వెన్నెల కిషోర్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. నాగినీడు చాలా బాగా నటించారు. కిషోర్ మరియు సత్య కూడా తమ పాత్రలలో బాగానే నటించారు. ఈ సినిమాలో మంచి నటనను కనబరిచారు. ప్రగతి మరియు విద్యుల్లేఖ కూడా చాలా సహజంగా నటించారు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
రీమేక్ సినిమా అయినప్పటికీ దర్శకుడు సంతోష్ ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు నచ్చేవిధంగా బాగానే మార్చారు. కానీ చాలావరకు సన్నివేశాలు రిపీట్ అయినట్లు కనిపిస్తాయి. పైగా టి సంతోష్ నెరేషన్ చాలా స్లోగా ఉండడంతో ప్రేక్షకులకు అక్కడక్కడా కొంచెం బోర్ అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు థ్రిల్లింగ్ గా అనిపించినప్పటికీ…. మరికొన్ని మాత్రం నిరుత్సాహ పరుస్తాయి.
కథ విషయంలో బాగానే జాగ్రత్తలు తీసుకున్న టి సంతోష్ దాన్ని తెరమీద చూపించడంలో పూర్తిగా సఫలం కాలేకపోయాడు. మూవీ డైనమిక్స్ పతాకంపై రాజ్ కుమార్ అందించిన నిర్మాణ విలువలు చాలా బాగా ఉన్నాయి. సామ్ సి ఎస్ అందించిన సంగీతం చాలా బాగుంది. పాటలు సంగతి పక్కన పెడితే రాజ్ కుమార్ అందించిన నేపధ్య సంగీతం సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది. సూర్య సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.
బలాలు:
నిఖిల్, నేపధ్య సంగీతం, యాక్షన్ సన్నివేశాలు
బలహీనతలు:
సాగతీత సన్నివేశాలు, నెరేషన్ స్లో గా ఉండడం
చివరి మాట:
సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. మొదటి 30 నిమిషాలు కథ కొంచెం స్లోగా నడిచినప్పటికీ తర్వాత ఆసక్తికరంగా మారుతుంది. అయితే దర్శకుడి నెరేషన్ మాత్రం చాలా స్లోగా అనిపిస్తుంది. దీంతో అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమా కి అంతగా కనెక్ట్ అవ్వలేక పోవచ్చు.
అయితే… దర్శకత్వం సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో నిఖిల్ చాలా బాగా నటించాడు. కేవలం తన నటనతో సినిమాని ముందుకు నడిపాడని చెప్పవచ్చు. సెకండ్ హాఫ్ తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపిస్తుంది. సెకండాఫ్ కొంచెం స్లోగా సాగుతుంది.
బాటమ్ లైన్:
‘అర్జున్ సురవరం’ మంచి థ్రిల్లర్ సినిమా..