కెప్టెన్ గా విరాట్ కొహ్లీ మరో ప్రపంచ రికార్డు
అత్యంత వేగంగా 5వేల పరుగుల విరాట్ కొహ్లీ డే-నైట్ టెస్ట్ లో బంగ్లాపై కొహ్లీ బ్యాటింగ్ జోరు భారత కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ తన టెస్ట్ క్రికెట్ ప్రపంచ రికార్డుల ఖాతాలో మరో రికార్డును జమ చేసుకొన్నాడు. సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 5వేల పరుగుల మైలు రాయిని చేరిన కెప్టెన్ గా నిలిచాడు. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ తో ప్రారంభమైన డే-నైట్ టెస్ట్ తొలిరోజు ఆటలోనే కొహ్లీ అజేయ […]
- అత్యంత వేగంగా 5వేల పరుగుల విరాట్ కొహ్లీ
- డే-నైట్ టెస్ట్ లో బంగ్లాపై కొహ్లీ బ్యాటింగ్ జోరు
భారత కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ తన టెస్ట్ క్రికెట్ ప్రపంచ రికార్డుల ఖాతాలో మరో రికార్డును జమ చేసుకొన్నాడు. సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 5వేల పరుగుల మైలు రాయిని చేరిన కెప్టెన్ గా నిలిచాడు.
కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ తో ప్రారంభమైన డే-నైట్ టెస్ట్ తొలిరోజు ఆటలోనే కొహ్లీ అజేయ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు.
ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరుతో ఉన్న 97 ఇన్నింగ్స్ లో 5వేల పరుగుల రికార్డును విరాట్ కొహ్లీ 86 ఇన్నింగ్స్ లోనే సాధించడం విశేషం.
హేమాహేమీలను మించిన విరాట్…
గతంలో 5వేల పరుగుల మైలురాయిని చేరిన టెస్ట్ కెప్టెన్లలో క్లయివ్ లాయిడ్, స్టీఫెన్ ఫ్లెమింగ్, గ్రీమ్ స్మిత్, అలెన్ బోర్డర్ సైతం ఉన్నారు.
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ లాయిడ్ 106, గ్రీమ్ స్మిత్ 110, బోర్డర్ 116, స్టీఫెన్ ఫ్లెమింగ్ 130 ఇన్నింగ్స్ లో 5వేల పరుగులు సాధిస్తే…కొహ్లీ మాత్రం కేవలం 86 ఇన్నింగ్స్ లోనే 5వేల పరుగులతో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
బంగ్లాదేశ్ తో ప్రస్తుత సిరీస్ లోని రెండో టెస్టు వరకూ 84 టెస్టులు, 141 ఇన్నింగ్స్ లో 7వేల 100 పరుగులు, 26 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు సాధించిన ఘనత 31 సంవత్సరాల విరాట్ కొహ్లీకి ఉంది.