నువ్వు ఎంపీనా? ఏమో మాకు తెలియదు " వైసీపీ ఎంపీని తోసేసిన శ్రేణులు

తిరుపతి వైసీపీ ఎంపి బల్లి దుర్గాప్రసాద్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన్ను సొంత పార్టీ వారే గుర్తు పట్టలేకపోయారు. దాంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా తడ మండలంలోని గ్రామ సచివాలయాలను ప్రారంభించే కార్యక్రమానికి ఎమ్మెల్యే సంజీవయ్య, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డితో కలిసి ఎంపీ దుర్గాప్రసాద్‌ వచ్చారు. నేతలు రాగానే వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఎమ్మెల్యే సంజీవయ్య వద్దకు పరుగెత్తారు. కార్యకర్తలు ఎంపీని పక్కకు తోసేశారు. దాంతో ఎంపీ దుర్గాప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేయగా… […]

Advertisement
Update:2019-11-20 01:50 IST

తిరుపతి వైసీపీ ఎంపి బల్లి దుర్గాప్రసాద్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన్ను సొంత పార్టీ వారే గుర్తు పట్టలేకపోయారు. దాంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా తడ మండలంలోని గ్రామ సచివాలయాలను ప్రారంభించే కార్యక్రమానికి ఎమ్మెల్యే సంజీవయ్య, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డితో కలిసి ఎంపీ దుర్గాప్రసాద్‌ వచ్చారు.

నేతలు రాగానే వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఎమ్మెల్యే సంజీవయ్య వద్దకు పరుగెత్తారు. కార్యకర్తలు ఎంపీని పక్కకు తోసేశారు. దాంతో ఎంపీ దుర్గాప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేయగా… ఒక స్థానిక నేత మీరు ఎవరో మాకు తెలియదంటూ తోసుకెళ్లిపోయాడు.

దాంతో నొచ్చుకున్న ఎంపీ… ప్రజల మధ్యలోనే కూర్చున్నారు. దాంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సముదాయించారు.

‘‘నేను ఎంపీనని చెప్పుకునే పరిస్థితి ఏర్పడిందని, మీ ప్లెక్సీలలో నా ఫొటో వేశారు.. అయినా నేను ఎవరో తెలియదా!?” అంటూ ఆగ్రహంతో వెనుతిరిగే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే కల్పించుకొని టెంకాయ కొట్టాల్సిందిగా బతిమలాడారు. ఎంపీ నిరాకరించి జనం మధ్యలో కుర్చీలో కూర్చుండిపోయారు. వెంటనే ఎమ్మెల్సీ వాకాటి ఎంపీని సముదాయించి స్టేజీపైకి తీసుకువచ్చారు. కాని కొద్దిసేపటికే ఎంపీ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Tags:    
Advertisement

Similar News