ఆ మంత్రిని తొలగించబోతున్న కేసీఆర్ ?

ఆర్టీసీ సమ్మెతో ఎక్కడలేని చిక్కులు కేసీఆర్ కు వచ్చాయి. ఇక కార్మిక శాఖలో పెద్ద కుంభకోణాలు వెలుగుచూశాయి. మహిళా శిశుసంక్షేమ శాఖల్లో నిధులు అందక నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ఆ శాఖ చూస్తున్న మంత్రి మల్లారెడ్డిని తప్పించేందుకు కేసీఆర్ రెడీ అయ్యారన్న చర్చ ఇప్పుడు గులాబీ పార్టీలో విస్తృతంగా సాగుతోంది. కేసీఆర్ కు తలనొప్పులు తెచ్చిపెడుతున్న వ్యవహారాలన్నీ మంత్రి మల్లారెడ్డి చేపట్టిన కార్మిక, మహిళా శిశుసంక్షేమానికి చెందినవి కావడం గమనార్హం. అందుకే ఆ శాఖను సరిగా పర్యవేక్షించని […]

Advertisement
Update:2019-11-20 12:51 IST

ఆర్టీసీ సమ్మెతో ఎక్కడలేని చిక్కులు కేసీఆర్ కు వచ్చాయి. ఇక కార్మిక శాఖలో పెద్ద కుంభకోణాలు వెలుగుచూశాయి. మహిళా శిశుసంక్షేమ శాఖల్లో నిధులు అందక నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ఆ శాఖ చూస్తున్న మంత్రి మల్లారెడ్డిని తప్పించేందుకు కేసీఆర్ రెడీ అయ్యారన్న చర్చ ఇప్పుడు గులాబీ పార్టీలో విస్తృతంగా సాగుతోంది.

కేసీఆర్ కు తలనొప్పులు తెచ్చిపెడుతున్న వ్యవహారాలన్నీ మంత్రి మల్లారెడ్డి చేపట్టిన కార్మిక, మహిళా శిశుసంక్షేమానికి చెందినవి కావడం గమనార్హం.

అందుకే ఆ శాఖను సరిగా పర్యవేక్షించని మల్లారెడ్డిని కేసీఆర్ తీసేయబోతున్నాడనే ప్రచారం గులాబీ పార్టీలో బాగా సాగుతోంది.

మంత్రి మల్లారెడ్డి కూడా మంత్రి అవుతానని ఊహించలేదని చాలా సార్లు చెప్పుకొచ్చాడు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు కేసీఆర్. అయితే ఇప్పుడు రంగారెడ్డి నుంచి సబితా ఇంద్రారెడ్డి మంత్రి అయ్యారు. దీంతో మల్లారెడ్డికి స్వస్తి పలికేందుకు కేసీఆర్ రెడీ అయ్యారన్న ప్రచారం సాగుతోంది.

కేబినెట్ ను పునర్ వ్యవస్థీకరించడానికి కేసీఆర్ రెడీ అయినట్లు కనిపిస్తోంది. ఇందులో ప్రధానంగా మొదట వినిపించే పేరు మల్లారెడ్డినే అన్న అప్రచారం సాగుతోంది. కొత్తగా కొందరికి కేబినెట్ లో చొటు ఇచ్చి .. మరికొందరికి స్వస్తి పలుకుతారని అంటున్నారు. అందులో మల్లారెడ్డికి ఉద్వాసన ఖాయం అన్న చర్చ సాగుతోంది.

Tags:    
Advertisement

Similar News