రాజ్ కోట టీ-20లో నేడు డూ ఆర్ డై ఫైట్

బంగ్లాకు చెలగాటం…భారత్ కు సిరీస్ సంకటం భారత్-బంగ్లాదేశ్ జట్ల తీన్మార్ టీ-20 షో ..కాలుష్య ఢిల్లీ నుంచి..మహా తుపాను హోరులో చిక్కుకొన్న రాజ్ కోటకు చేరింది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే.. ఈ పోరు సిరీస్ కే నిర్ణయాత్మకంగా మారింది.9వ ర్యాంకర్ బంగ్లాదేశ్ కు చెలగాటం, 5వ ర్యాంకర్ భారత్ కు సిరీస్ సంకటంగా మారింది. ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో ప్రపంచ మాజీ చాంపియన్ భారత్ అసలు సిసలు పరీక్ష ఎదుర్కొంటోంది. బంగ్లాదేశ్ పై సిరీస్ ఆశలు […]

Advertisement
Update:2019-11-07 01:40 IST
  • బంగ్లాకు చెలగాటం…భారత్ కు సిరీస్ సంకటం

భారత్-బంగ్లాదేశ్ జట్ల తీన్మార్ టీ-20 షో ..కాలుష్య ఢిల్లీ నుంచి..మహా తుపాను హోరులో చిక్కుకొన్న రాజ్ కోటకు చేరింది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే.. ఈ పోరు సిరీస్ కే నిర్ణయాత్మకంగా మారింది.9వ ర్యాంకర్ బంగ్లాదేశ్ కు చెలగాటం, 5వ ర్యాంకర్ భారత్ కు సిరీస్ సంకటంగా మారింది.

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో ప్రపంచ మాజీ చాంపియన్ భారత్ అసలు సిసలు పరీక్ష ఎదుర్కొంటోంది. బంగ్లాదేశ్ పై సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే…. రాజ్ కోట వేదికగా ఈ రోజు జరిగే రెండో టీ-20 పోటీ..రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత యువజట్టుకు చావో బతుకో అన్నట్లుగా మారింది.

భారత్ కు టెన్షన్ టెన్షన్…

ఢిల్లీ వేదికగా ముగిసిన తొలి సమరంలో ఎదురైన 7 వికెట్ల ఓటమితో కంగుతిన్న భారత్…దెబ్బతిన్న బెబ్బులిలా రెండో టీ-20 బరిలోకి దిగనుంది.

డాషింగ్ ఓపెనర్ కమ్ కెప్టెన్ రోహిత్ శర్మ ..వ్యక్తిగతంగా తాను రాణించడం ద్వారా జట్టును ముందుండి నడిపించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 42 బాల్స్ల్ లో 41 పరుగులు చేయటం టీమ్ మేనేజ్ మెంట్ ను కలవరపెడుతోంది.

యువఆటగాళ్లు రాహుల్, రిషభ్ పంత్, శివం దూబే సైతం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోడంతో.. టీమ్ మేనేజ్ మెంట్ ఉక్కిరిబిక్కిరవుతోంది.

సిరీస్ వైపు బంగ్లా చూపు…

ఇద్దరు సీనియర్ క్రికెటర్లు షకీబుల్ హసన్, తమీమ్ ఇక్బాల్ లేకుండానే భారత్ ను కంగుతినిపించిన బంగ్లాజట్టు… వరుసగా రెండోమ్యాచ్ లో సైతం నెగ్గి.. భారత్ పై మొట్టమొదటి సిరీస్ విజయంతో సరికొత్త చరిత్ర సృష్టించాలన్నపట్టుదలతో ఉంది.

సౌమ్య సర్కార్, ముష్ ఫికుర్ రహీం, మహ్మదుల్లా లాంటి సీనియర్లే జట్టు బాధ్యతను తమ భుజం పైన వేసుకొని ఆడటం..బంగ్లా టైగర్స్ లో సరికొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.

భారత్ 8 – బంగ్లా 1…

భారత్ , బంగ్లాజట్ల మధ్య ప్రస్తుత సిరీస్ లోని ఢిల్లీ మ్యాచ్ వరకూ రెండుజట్లూ ఆడిన 9 మ్యాచ్ ల్లో భారత్ 8 విజయాలు, బంగ్లా ఒకే ఒక్క గెలుపు రికార్డుతో ఉన్నాయి.

తొలిమ్యాచ్ లో ఎదురుదెబ్బ తగిలినా..0-1తో సిరీస్ లో వెనుకబడినా ఆతిథ్య భారతజట్టే హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

మహాతుపాను కరుణిస్తే…20 ఓవర్ల ఈ పోరు అరవై థ్రిల్స్ తో సాగటం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరియర్ లో ఆడుతున్న ఈ వందవ టీ-20 మ్యాచ్ ను విజయంతో చిరస్మరణీయంగా మిగుల్చుకోవాలని కోరుకుందాం.

Tags:    
Advertisement

Similar News