పవన్ కు దక్కని కేసీఆర్, కేటీఆర్, కేకే అపాయింట్మెంట్

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌ షాక్ ఇచ్చారు. పవన్‌ కల్యాణ్ కలిసేందుకు ప్రయత్నించగా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌, హరీష్‌రావు, ఎంపీ కేకేలనైనా కలవాలని పవన్‌ కల్యాణ్ ప్రయత్నించారు. కానీ వారు కూడా ఆయనకు అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. ఈ పరిణామం చర్చనీయాంశమైంది. ఆర్టీసీ సమ్మె పట్ల కేసీఆర్‌ సరిగా వ్యవహరించడం లేదని… ఆయన్ను కలిసి మాట్లాడుతానని పవన్ కల్యాణ్ చెప్పారు. కానీ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించగా అటు వైపు […]

Advertisement
Update:2019-11-02 02:32 IST

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌ షాక్ ఇచ్చారు. పవన్‌ కల్యాణ్ కలిసేందుకు ప్రయత్నించగా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌, హరీష్‌రావు, ఎంపీ కేకేలనైనా కలవాలని పవన్‌ కల్యాణ్ ప్రయత్నించారు. కానీ వారు కూడా ఆయనకు అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. ఈ పరిణామం చర్చనీయాంశమైంది.

ఆర్టీసీ సమ్మె పట్ల కేసీఆర్‌ సరిగా వ్యవహరించడం లేదని… ఆయన్ను కలిసి మాట్లాడుతానని పవన్ కల్యాణ్ చెప్పారు. కానీ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించగా అటు వైపు నుంచి ప్రతికూల స్పందన వచ్చింది. గతంలో కేసీఆర్‌తో పవన్ కల్యాణ్ కలిశారు. కానీ ఈసారి కేసీఆర్ ఆ అవకాశం ఇవ్వలేదు.

పవన్ కల్యాణ్ రాజకీయ వైఖరి, టీడీపీకి అనుకూలంగా ఆయన వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయంతోనే కేసీఆర్‌ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని చెబుతున్నారు.

కేసీఆర్ అపాయింట్‌మెంట్ నిరాకరించడంతో టీఆర్‌ఎస్ మంత్రులతో పాటు చివరకు ఎంపీ కేకే కూడా పవన్‌ను కలిసేందుకు ఇష్టపడలేదు.

అయితే టీఆర్‌ఎస్ పెద్దల అపాయింట్‌మెంట్‌ కోసం జనసేన వర్గాలు ఇప్పటికీ వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తున్నాయి. చూడాలి టీఆర్‌ఎస్ పెద్దల అపాయింట్‌మెంట్‌ పవన్‌కు దక్కుతుందో లేదో.

Tags:    
Advertisement

Similar News