పంతం వీడని కేసీఆర్....
తెలంగాణ సీఎం కేసీఆర్ ముందరి కాళ్లకు బంధం వేస్తున్నారు. కోర్టులు, కేంద్రం వల్ల కేసీఆర్ చేయాలనుకున్న పనులు చేయలేకపోతున్నారు. కొత్తసచివాలయం, అసెంబ్లీ భవనాలకు శంకుస్థాపన కూడా చేసేసిన కేసీఆర్ కు కోర్టు ఆంక్షలతో అడ్డుకట్ట పడింది. ఇక సచివాలయం కోసం కేంద్రం పరిధిలో ఉన్న రక్షణ శాఖ స్థలాన్ని కావాలని కేసీఆర్ గడిచిన ఐదేళ్లుగా కొట్లాడినా అది సాధ్యం కాలేదు. అందుకే ఇప్పుడు తన నిర్ణయాలు అమలు చేసేందుకు కేసీఆర్ కొత్త స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. తాజాగా […]
;తెలంగాణ సీఎం కేసీఆర్ ముందరి కాళ్లకు బంధం వేస్తున్నారు. కోర్టులు, కేంద్రం వల్ల కేసీఆర్ చేయాలనుకున్న పనులు చేయలేకపోతున్నారు. కొత్తసచివాలయం, అసెంబ్లీ భవనాలకు శంకుస్థాపన కూడా చేసేసిన కేసీఆర్ కు కోర్టు ఆంక్షలతో అడ్డుకట్ట పడింది.
ఇక సచివాలయం కోసం కేంద్రం పరిధిలో ఉన్న రక్షణ శాఖ స్థలాన్ని కావాలని కేసీఆర్ గడిచిన ఐదేళ్లుగా కొట్లాడినా అది సాధ్యం కాలేదు. అందుకే ఇప్పుడు తన నిర్ణయాలు అమలు చేసేందుకు కేసీఆర్ కొత్త స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
తాజాగా ఎర్రమంజిల్ భవనం కూల్చేసేందుకు, అసెంబ్లీ, సచివాలయ నిర్మాణ విషయంలో కోర్టుల నుంచి కేసీఆర్ కు చిక్కులు రావడం.. ఆ నిర్మాణాలు ప్రారంభం కాకపోవడంతో కేసీఆర్ ఎలాగైనా సరే వాటిని పూర్తి చేయాలనే పట్టుదలతో కొత్త స్కెచ్ వేస్తున్నారట.
తాజాగా కేసీఆర్ కన్ను న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ పై పడినట్టు తెలిసింది. న్యూఢిల్లీలో ఉన్నట్లు హైదరాబాద్ లో కూడా కానిస్టిట్యూషనల్ క్లబ్ ఏర్పాటుకు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ను కేటాయించాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలిసింది.
ఈ క్రమంలోనే ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ను ఖాళీ చేసి హైదర్ గూడలో కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యే క్వార్టర్స్ లోకి మారాలని కేసీఆర్ ప్రభుత్వం తాజాగా ఎమ్మెల్యేలు, మంత్రులకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ ను స్వాధీనం చేసుకొని 11 ఎకరాలలో కానిస్టిట్యూషనల్ క్లబ్ కట్టనున్నారు. ఇందులో మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వాడుకునేలా సరికొత్త హంగులతో భవనాలు నిర్మిస్తారట. అంతేకాదు ఇక్కడే కొత్త అసెంబ్లీని నిర్మించాలా లేదా కానిస్టిట్యూషనల్ క్లబ్ నే ఏర్పాటు చేయాలా అనే దానిపై కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నట్టు తెలిసింది.