సోషల్ మీడియాలో రానా, నిర్మాత రాజన్ వాగ్వాదం
దగ్గుబాటి రానా ”1945” చిత్రం విషయంలో నిర్మాత రాజరాజన్‌తో సోషల్ మీడియాలో గొడవపడ్డారు. రానా హీరోగా ”1945” చిత్రాన్ని శివకుమార్ దర్శకత్వంలో నిర్మించే ప్రయత్నం చేశారు. దీనికి నిర్మాతగా రాజరాజన్ వ్యవహరించారు. దీపావలి సందర్భంగా చిత్రయూనిట్ ”1945” సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ అంటూ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ఇలా విడుదల చేయడంపై రానా ఆగ్రహం వ్యక్తం చేశారు. ”1945” ఒక అసంపూర్ణ చిత్రమని వ్యాఖ్యానించాడు. ఈ సినిమాను నిర్మించడంలో నిర్మాత విఫలమయ్యాడని… ఆ సినిమా […]
దగ్గుబాటి రానా ”1945” చిత్రం విషయంలో నిర్మాత రాజరాజన్‌తో సోషల్ మీడియాలో గొడవపడ్డారు. రానా హీరోగా ”1945” చిత్రాన్ని శివకుమార్ దర్శకత్వంలో నిర్మించే ప్రయత్నం చేశారు. దీనికి నిర్మాతగా రాజరాజన్ వ్యవహరించారు.
దీపావలి సందర్భంగా చిత్రయూనిట్ ”1945” సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ అంటూ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ఇలా విడుదల చేయడంపై రానా ఆగ్రహం వ్యక్తం చేశారు. ”1945” ఒక అసంపూర్ణ చిత్రమని వ్యాఖ్యానించాడు. ఈ సినిమాను నిర్మించడంలో నిర్మాత విఫలమయ్యాడని… ఆ సినిమా ఇప్పటికీ అసంపూర్ణంగానే ఉందని… ఏడాది నుంచి అసలు ఈ చిత్ర బృందంతో కూడా తాను కలవలేదని రానా పోస్టు పెట్టారు. డబ్బు సంపాదన కోసమే ఫస్ట్ లుక్‌ను మోసపూరితంగా విడుదల చేసినట్టుగా ఉందని… దీన్ని ఎవరూ ప్రోత్సహించవద్దని రానా సూచించాడు.
రానా వ్యాఖ్యలపై నిర్మాత రాజరాజన్ తీవ్రంగా స్పందించారు. చిత్రం పూర్తయిందా లేదా అన్నది దర్శకుడు నిర్ణయిస్తారని… సినిమా పూర్తయిందో లేదో ప్రేక్షకులను నిర్ణయించనివ్వండి అంటూ విమర్శించారు. 60 రోజుల షూటింగ్ కోసం తాను కోట్లాది రూపాయలు ఖర్చు చేశానని… అసంపూర్ణ చిత్రమైతే దాన్ని ఎవరూ విడుదల చేయరు కదా అని నిర్మాత ప్రశ్నించారు.